టిక్ టాక్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే చర్చ. ఇండో చైనా సరిహద్దు వివాదం నేపద్యంలో చైనా యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించడంతో టిక్ టాక్ యాప్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.  ఈ నేపధ్యంలో టిక్ టాక్ తరపున కోర్టులో వాదించడానికి మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ నిరాకరించడం  ప్రాధాన్యత సంతరించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 59 యాప్ లలో టిక్ టాక్ ప్రధానంగా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ కున్న 26 కోట్ల పై చిలుకు యూజర్లలో 11 కోట్ల మంది భారతీయులే. దాంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ సంస్థ న్యాయపోరాటానికి సన్నద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో తమ సంస్థ తరపున వాదించడానికి భారతదేశ మాజీ అటార్నీ జనరల్ ముకుల్  రోహత్గీను టిక్ టాక్ కోరింది. ఆ సంస్థ తరపున, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను వాదించనని స్పష్టం చేశారు. Also read: Nusrat jahan: టిక్ టాక్ నిషేధం తొందరపాటే : నుస్రత్ జహాన్


జూన్ 15న తూర్పు లడాఖ్ లోని గల్వాన్ లోయలో ఇండియా చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ, 20 మంది భారత సైనికుల వీరమరణం నేపద్యంలో చైనా దేశపు యాప్ లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దేశ భద్రతకు సంబంధించిన అంశంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. Also read: TikTok Data: మీ టిక్ టాక్ డేటాను ఇలా డౌన్ లోడ్ చేసుకోండి