Former Uttar Pradesh CM Mulayam singh yadav passes away at 82: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ములాయం.. సోమవారం ఉదయం గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ విషయాన్ని ములాయం తనయుడు అఖిలేశ్ యాదవ్‌ ధ్రువీకరించారు. యాదవ్ మరణం పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనారోగ్య సమస్యలతో ములాయం సింగ్‌ యాదవ్‌ గత ఆగస్టు మాసం నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో అక్టోబర్‌ 2న ములాయంను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటినుంచి ఆయన ఐసీయూలోనే ఉన్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడడంతో  ఇన్ని రోజులు వెంటి లెటర్‌పై ఉన్నారు. ఇక ఆరోగ్యం మరింత  విషమించడంతో ఈరోజు ఉదయం ములాయం కన్నుమూశారు. 



1939 నవంబరు 22న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సైఫయి గ్రామంలో ములాయం సింగ్‌ యాదవ్‌ జన్మించారు. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన ఎక్కడ సభలు జరిగినా చురుగ్గా పాల్గొనేవారు. అంచెలంచెలుగా ఎదుగుతూ..1967లో తొలిసారిగా ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్‌ పార్టీ నుంచి మొదటిసారి యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం  1992లో సమాజ్‌వాదీ పార్టీని సొంతంగా స్థాపించారు. అప్పటినుంచి ములాయం యూపీలో చక్రం తిప్పారు.  ఆయన రాజకీయ కెరీర్‌లో 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్‌సభ సభ్యుడు, మూడు సార్లు సీఎంగా ప్రజలకు సేవలు అందించారు.


Also Read: మాథ్యూ వేడ్‌ పెద్ద చీటర్.. క్రికెట్ నుంచి ఆస్ట్రేలియాను బ్యాన్ చేసేయండి!


Also Read: IND vs SA: శ్రేయాస్-ఇషాన్ సూపర్ బ్యాటింగ్‌.. సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook