Mumbai Attacks: ప్రపంచమంతా నిర్ఘాంతపోయింది. ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమానికి ముంబై విలవిల్లాడింది. ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం పది మంది ఉగ్రవాదులు దేశ ఆర్ధిక రాజధానిలో మరణమృదంగం సృష్టించారు. 166 మంది ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన ఇది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అది 2008 నవంబర్ 26వ తేదీ. ఎప్పటిలానే దేశ ఆర్ధిక రాజధాని రోజు ప్రారంభమైంది. ఉరుకులు పరుగుల జీవితంలో అందరూ బిజీగా అయిపోయారు. ముంబైకు ఠీవిగా నిలిచే సముద్రం నుంచి ఆ రోజు రాత్రి మృత్యుదేవత ముంచుకురానుందని ఎవరూ ఊహించలేదు. పగలు దాటింది. రాత్రి సమీపించింది. ఇలా రాత్రి మొదలైందో లేదో అప్పటికే సముద్రమార్గం ద్వారా అక్రమంగా ప్రవేశించిన 10 మంది లష్కరో తోయిబా ఉగ్రవాదులు ముంబైలోని వేర్వేరు ప్రాంతాలకు చేరుకున్నారు. ఏకకాలంలో రెండు ఫైవ్ స్టార్ హోటళ్లు, ఒక హాస్పిటల్, రైల్వే స్టేషన్, యూదుల కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దారుణకాండకు తెగబడ్డారు. ఓ భారతీయ పడవను హైజాక్ చేసి అందులో వారిని చంపేశారు. రాత్రి 8 గంటలకు కోలాబా సమీపంలోని చేపల మార్కెట్‌లో దిగిన దుండగులు రెండు బృందాలుగా విడిపోయి దాడులు ప్రారంభించారు. 


నారిమన్ హౌస్‌లోని యూదుల కేంద్రం చాబాద్ హౌస్‌పై దాడి చేసి అత్యాధునిక గన్లతో కాల్పులు జరిపారు. ఆ తరువాత లియోఫోర్ట్ కేఫ్ టార్గెట్ చేశారు. విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 10 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఓ టీమ్ దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ రైలు టెర్మినల్ చేరుకుని కాల్పులు జరిపారు. రైల్వే స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో 58 మంది అక్కడికక్కడే మరణించారు. అక్కడ్నించి బయటికొచ్చి కామా ఆసుపత్రిలో ప్రవేశించారు. ఆసుపత్రిలో భయానక వాతావరణం సృష్టించారు. ఒబెరాయ్ హోటల్‌లో ప్రవేశించి అక్కడి టూరిస్టులు ఇతరుల్ని బందీలుగా చేసుకున్నారు. 


మరోవైపు తాజ్ హోటల్‌లో ఇంకో గ్రూప్ ప్రవేశించింది. ఏ మాత్రం దయలేకుండా నిర్ధాక్షిణ్యంగా జరిపిన కాల్పుల్లో 31 మంది మరణించారు. దాదాపు 60 గంటలకు పైగా ఉగ్రవాదులకు భద్రతా సిబ్బంది, ఎన్ఎస్‌జి కమాండోలకు భారీగా ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఉగ్రవాదులందర్నీ కడతేర్చగలిగారు. ఉగ్రవాదుల్లో ఒకడైన కసబ్‌ను సజీవంగా పట్టుకుని ఆ తరువాత ఉరి తీశారు. 


ముంబై మారణకాండలో 18 మంది భద్రతాసిబ్బంది సహా 166 మంది మరణించారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎందరో సామాన్యులు, వాచ్‌మెన్‌లు , కానిస్టేబుల్ నుంచి ఉన్నత ర్యాంకు అధికారులు ఉగ్రవాదులతో పోరాడి మృత్యువాతపడ్డారు. ముంబై మారణహోమానికి నేటికి 15 ఏళ్లు. దేశ ప్రజానీకం ముఖ్యంగా ముంబై ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఓ కాళరాత్రి. అంతటి మృత్యుకేళి నుంచి కూడా ముంబై త్వరగానే కోలుకుంది. ఎప్పటిలానే బిజీగా మారిపోయింది.


Also read: IPL 2024 Updates: ఐపీఎల్ వేలంలో ఆ ముగ్గురు ప్రపంచకప్ హీరోలపై ఆర్సీబీ ఫోకస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook