IPL 2024 Updates: ఐపీఎల్ 2024 మెగా వేలం మరి కొద్దిరోజుల్లో జరగనుంది. ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా ఇవాళ వెలువడనుంది. మరోవైపు మరి కొందరు ఆటగాళ్లు వేలంలో చేరనున్నారు. ప్రపంచకప్ 2023లో హీరోలుగా నిలిచిన స్టార్ ఆటగాళ్లపై అన్ని జట్లు దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ ముగ్గురు ఆటగాళ్లపై కన్నేసింది.
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ మేటి జట్టుగా, అద్బుతమైన ఆటగాళ్లు కలిగిన టీమ్‌గా ఉన్నా సరే టైటిల్ మాత్రం గెలవలేకపోయింది ఆర్సీబీ. 2009,2011,2016లో మూడు సార్లు ఫైనల్ చేరినా టైటిల్ సాధించలేకపోయింది. ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదని భావిస్తోంది. ఆటగాళ్ల ఎంపికలో కొన్ని సార్లు చేసిన తప్పుల్ని మరోసారి చేయకూడదని నిర్ణయించుకుంది. జట్టుకు భారంగా మారిన కొందర్ని వదిలించుకోనుంది. దినేష్ కార్తీక్, కరణ్ శర్మను విడుదల చేయనుండగా షాబాద్ అహ్మద్‌ను ట్రేడింగ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మార్చుకుంది. ఆ జట్టు నుంచి మయాంక్ అగర్వాల్‌ను తీసుకుంది. ఇప్పుడు జట్టుకు స్పిన్నర్ అండ్ ఆల్‌రౌండర్ అవసరముంది. శ్రీలంక ఆటగాడు దునిత్ వెల్లలాగేపై ఆర్సీబీ ఆసక్తి కనబరుస్తోంది. నెదర్లాండ్స్ పేసర్ అండ్ ఆల్ రౌండర్ బాస్ డీ లీడ్‌పై ఆర్సీబీ సహా ఇతర జట్టు దృష్టి సారించవచ్చు.
శ్రీలంకకు చెందిన మరో బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ సదీర సమర విక్రమను కొనుగోలు చేసేందుకు ఆర్సీపీ ఆలోచన చేయనుందని తెలుస్తోంది. వీరందరితో పాటు టాప్ ప్రయారిటీలో ముగ్గురు ఆటగాళ్లపై ఆర్సీబీ దృష్టి సారించింది. ప్రపంచకప్ టైటిల్ ఆస్ట్రేలియాకు సాధించి పెట్టడంలో కీలకంగా వ్యవహరించిన ఆల్ రౌండర్ ట్రావిస్ హెడ్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్, శ్రీలంక పేసర్ దిల్షన్ మధుశంకలపై ఆర్సీబీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎలాగైనా ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, డారిల్ మిచెల్‌లను సొంతం చేసుకునేందుకు ప్లానింగ్ చేస్తోంది.
Also read; IPL 2024 Updates: సంచలనం రేపుతున్న ఆర్సీబీ ట్వీట్, పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐపీఎల్ ఆడనున్నాడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook