ముంబై: కరోనా మహమ్మారిని కట్టడి చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించబోయిన సంఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలోలి గ్రామంలో నాయక్ జావేద్ జమాదార్ అనే కానిస్టేబుల్ లాక్‌డౌన్ నేపథ్యంలో పెట్రోలింగ్ చేస్తున్నాడు. షాపింగ్ సముదాయాలను తనిఖీలు చేస్తున్న సమయంలో అరుణ్ సింగ్ జాధవ్ అనే వ్యక్తి బార్ షాపును వద్ద చేసాడు. యజమానిని ప్రశ్నించిన పోలీస్ పై అరుణ్ సింగ్ కానిస్టేబుల్ ఫోన్ తీసుకొని నేలకేసి కొట్టాడు.  ఏపీలో కరోనా కలకలం.. తాజాగా 71 పాజిటివ్ కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా తన దగ్గర ఉన్న బ్లేడ్‌తో కానిస్టేబుల్‌పై దాడి చేసి కారులో నుండి పెట్రోల్ తీసి కానిస్టేబుల్ పై చల్లాడు. అగ్గిపుల్ల గీసి మంటలు అంటిస్తుండగా స్థానికులు అరుణ్ సింగ్‌ను పట్టుకున్నారు. స్థానికులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు సబ్ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని గాయపడిన కానిస్టేబుల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై ఐపీసీ 301, 506, 332, 353 కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ రాజ్‌గురు తెలిపారు. 


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా! 


Read Also:  Pics: క్యాలెండర్ గాళ్ సొగసు చూడతరమా!