Nandamuri Balakrishna jeep ride at Chirala beach: టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంచి జోష్‌లో ఉన్నారు. గత రెండు రోజులుగా బాలయ్య సంక్రాంతి సంబరాలు అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. తాజాగా కనుమ పండగ వేళ (జనవరి 16) బాలయ్య కుటుంబంతో కలిసి చీరాల బీచ్‌లో సందడి చేశారు. బీచ్ ఒడ్డున ఓపెన్ టాప్ జీపును రయ్యిమని పరుగులు పెట్టించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్రంట్ సీటులో బాలయ్య పక్కనే కూర్చొన్న ఆయన సతీమణి వసుంధర.. బాలయ్య స్పీడ్, జోష్‌కు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇద్దరూ కలిసి కెమెరాకు థంబ్సప్ సింబల్ చూపించారు. బీచ్ ఒడ్డున బాలయ్య జీప్ రైడింగ్‌ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


రెండు రోజుల క్రితం సంక్రాంతి వేడుకల కోసం బాలయ్య తన కుటుంబంతో కలిసి ప్రకాశం జిల్లా కారంచేడు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ తన సోదరి, బీజేపీ నేత పురందేశ్వరి ఇంట్లో వేడుకలు జరుపుకుంటున్నారు. బాలకృష్ణ కుటుంబంతో పాటు ఆయన సోదరుడు జయకృష్ణ, సోదరిలు ఉమా మహేశ్వరి, లోకేశ్వరి కుటుంబాలు పురందేశ్వరి ఇంట్లో పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. 


సంక్రాంతి పండగ వేళ (జనవరి 15) నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు కారంచేడులోని స్థానిక ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ఇంటికొచ్చాక బాలయ్య గుర్రమెక్కి కొద్దిసేపు స్వారీ చేశారు. బాలయ్యతో (Nandamuri Balakrishna) పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ సైతం గుర్రంపై స్వారీ చేశారు. ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సినిమాల పరంగా.. బాలయ్య అఖండ సినిమా విడుదలై నెలన్నర రోజులు కావొస్తున్నా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తూనే ఉంది. 45వ రోజు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.18 లక్షల వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ అఖండ సినిమా రూ.130 కోట్లు కొల్లగొట్టినట్లు చెబుతున్నారు.


Also Read: Flipkart, Amazon sale: రేపటి నుంచే ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​ రిపబ్లిక్​ డే ఆఫర్లు..


Also read: Maruti Suzuki Price Hike: మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు- అదే బాటలో మరిన్ని కంపెనీలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook