Taking Viagra Pills With Alcohol : హోటల్లో ఒక మహిళతో బస చేసిన నాగపూర్‌కి చెందిన 41 ఏళ్ల వ్యక్తి.. రాత్రి వేళ 2 వయాగ్రా పిల్స్ వేసుకున్నాడు. ఆల్కాహాల్ సేవిస్తూ వయాగ్రా పిల్స్ వేసుకున్నాడు. ఆ మరునాడు శరీరం అంతా తీవ్రమైన అలసటగా అనిపించింది. వాంతులు కూడా అయ్యాయి. అతడి పరిస్థితి చూసి ఆందోళనకు గురైన అతడి వెంట ఉన్న మహిళ.. డాక్టర్‌ని సంప్రదించాల్సిందిగా సూచించింది. అయినప్పటికీ అతడు లైట్ తీసుకున్నాడు. గతంలోనూ తనకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని.. ఏమీ కాదులే అని ఆ మహిళకు ధైర్యం చెప్పి తన సమస్యను లైట్ తీసుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఆ తరువాత కొద్దిసేపట్లోనే పరిస్థితి మరింత చేజారిపోయింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ వ్యక్తిని సదరు మహిళ హోటల్ సిబ్బంది సహాయంతో చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. అతడు సెరెబ్రోవస్కులర్ హ్యామరేజ్‌తో మృతి చెందినట్టుగా స్పష్టం అయంది. సెరెబ్రోవస్కులర్ హ్యామరేజ్ అంటే మెదడుకు ఆక్సీజన్ సరఫరా తగ్గినప్పుడు ఒక వ్యక్తికి ఎదురయ్యే అనారోగ్య పరిస్థితిని సెరెబ్రోవస్కులర్ హ్యామరేజ్‌ అంటారు. 


ఎక్కడ పొరపాటు జరిగిందంటే.. 
అతడు అంతకంటే ముందు రోజు రాత్రి 50Mg ఉండే సిల్డెనాఫిల్ వయాగ్రా టాబ్లెట్స్ వేసుకున్నాడు. అదే సమయంలో ఆల్కాహాల్ కూడా సేవించాడు. ఆల్కాహాల్ సేవిస్తూ మెడిసిన్ తీసుకోవడం అనేది సరైన కాంబినేషన్ కాదు. ఆల్కాహాల్ తో మెడిసిన్ కలిపి తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ప్రమాదకరంగా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇక్కడ ఈ వయాగ్రా పిల్స్ తీసుకున్న వ్యక్తి విషయంలోనూ అదే జరిగింది. పోస్ట్‌మార్టం నివేదికను పరిశీలిస్తే.. శరీరంలో 300 గ్రాముల రక్తం గడ్డకట్టి కనిపించింది. వైద్యుల సూచనల మేరకు ఉపయోగించాల్సిన మెడిసిన్స్‌ని సొంతంగా వినియోగించడం ఒక పొరపాటు అయితే.. ఆ మెడిసిన్‌ని ఆల్కాహాల్‌లో కలిపి సేవించడం అతడు చేసిన మరో పొరపాటైంది.


ఇది కూడా చదవండి : Pineapple Benefits: పడక సుఖం పెంచే పైనాపిల్ పండు తింటే కేకో కేక


ఇది కూడా చదవండి : Bed Room Matters: శృంగారంలో పాల్గొన్న తరువాత మహిళలకు మూత్ర విసర్జన తప్పనిసరా ? ఎందుకు ?


ఇది కూడా చదవండి : Jaggery Vs Sugar: మీ ఆరోగ్యానికి షుగర్ మంచిదా..? లేక బెల్లం మంచిదా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook