Private Hospitals: కరోనా బాధితులకు పది లక్షలు తిరిగి చెల్లించాలంటూ ఆ ఆసుపత్రికి ఆదేశాలు
Private Hospitals: కరోనా మహమ్మారి పేరు చెప్పుకుని ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువైపోయింది. కరోనా వైద్యం పేరుతో లక్షలు గుంజుతున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వాలు కొరడా ఝులిపిస్తున్నాయి. తాజాగా ఆ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న బాథితులకు పది లక్షలు చెల్లించాంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
Private Hospitals: కరోనా మహమ్మారి పేరు చెప్పుకుని ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువైపోయింది. కరోనా వైద్యం పేరుతో లక్షలు గుంజుతున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వాలు కొరడా ఝులిపిస్తున్నాయి. తాజాగా ఆ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న బాథితులకు పది లక్షలు చెల్లించాంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
కరోనా వైరస్ మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో(Corona Second Wave) ప్రైవేటు ఆసుపత్రుల దందా ఎక్కువైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కరోనా వైద్యం పేరిట లక్షలు గుంజేస్తున్నారు. రోజుకు లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువే వసూలు చేస్తున్న ఆసుపత్రులున్నాయి. ఇటువంటి ఆసుపత్రులపై ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఆ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న 92 మంది కరోనా బాధితులకు పది లక్షల రూపాయలు తిరిగి చెల్లించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
మహారాష్ట్రలోని (Maharashtra) నాగ్‌పూర్‌కు చెందిన రేడియన్స్ ఆసుపత్రి(Radiance Hospital) యాజమాన్యం బాధితులకు కరోనా పరీక్షలు నిర్వహించి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్టు ఆరోపణలొచ్చాయి. చికిత్స చేస్తున్నందుకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో వివరణ ఇవ్వాలంటూ అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ (Nagpur Municipal Corporation) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు రేడియన్స్ ఆసుపత్రి యాజమాన్యం స్పందించకపోవడంతో ఆగ్రహించిన నాగ్‌పూర్ కార్పొరేషన్ అదనపు కమీషనర్ జలాజ్ శర్మ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా రేడియన్స్ ఆసుపత్రి యాజమాన్యం అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు ఆధారాలు లభించాయి. రేడియన్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న కరోనా బాధితులు లేదా బంధువులు మొత్తం 92 మందికి 10 లక్షల 32 వేల 243 రూపాయలు తిరిగి చెల్లించాలని ఆదేశించారు. బాధితులకు డబ్బు చెల్లించే విషయంలో ఏం తేడా వచ్చినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంటువ్యాధి, విపత్తు నిర్వహణ చట్టం కింద ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also read: Mehul Choksi: డొమినికాలో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్, శరీరంపై గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook