Omicron cases in India rising continuously: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజు రోజుకు  కేసులు క్రమంగా పెరుగుతూ (Omicron scare) వస్తున్నాయి. కర్ణాటకలో మరో ఒమిక్రాన్ కేసు బయపడినట్లు (Omicron cases in Karnataka) రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్​ తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ పాజిటివ్​గా తేలినట్లు చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసోలేషన్​లో చికిత్స..


కొత్తగా కొవిడ్ ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించిన ఆ వ్యక్తికి.. ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్​ వార్డులో ఉంచినట్లు మంత్రి సుధాకర్ వెల్లడించారు. అతనితో సన్నిహితంగా ఉన్న 20 మందిని గుర్తించినట్లు పేర్కొన్నారు. వారందరికి కూడా  కొవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.


తాజా కేసుతో కర్ణాటకలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య (Omicron cases in Karnataka) మూడుకు చేరింది.


నాగ్​పూర్​లో తొలి కేసు..


మరోవైపు మహారాష్ట్రలో మరొకరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. నాగ్​పూర్​కు (First Omicron case in Nagpur) చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ సోకినట్లు గుర్తించామని.. మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. ఆ వ్యక్తి వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లొచ్చినట్లు చెప్పారు.


ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్పారు వైద్యులు. ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఆతనితో సన్నిహితంగా మెలిగిన వారందరిని గుర్తించి వారికి కూడా కొవిడ్ పరీక్షలు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.


తాజా కేసుతో మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య (Omicron cases in Maharastra) 18కి పెరిగింది. ఇందులో ఇప్పటికే ఏడుగురు సురక్షితంగా కోలుకున్నారు. మిగతా వారికి చికిత్స కొనసాగుతోంది.


మొత్తం మీద ఇవాళ ఇప్పటి వరకు నాలుగు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీనితో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు (Omicron cases in India) 37కు చేరాయి.


Also read: Covid19 Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది


Also read: Overnight millionaire: ఉదయం రూ.270తో లాటరీ కొన్నాడు- మధ్యాహ్నం కోటీశ్వరుడయ్యాడు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook