Madhya Pradesh: వర్షాలు కురిపించాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ బాలికలను నగ్నంగా వీధుల్లో తిప్పిన అనాగరిక ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. బుందేల్‌ఖండ్ రీజియన్(Bundelkhand region) దమోహ్‌ జిల్లాలోని బనియా గ్రామం(Baniya village)లో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన కంప్యూటర్‌ యుగంలోనూ కొనసాగుతున్న మూఢాచారాలకు అద్దం పడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ గ్రామంలో ఓ ఆచారాన్ని పాటిస్తారు. అందులో భాగంగా బాలికలను నగ్నం(Naked)గా మార్చి, కప్పను కట్టిన ఓ కర్రను వారి భుజాలపై పెట్టి, వీధుల్లో తిప్పుతూ మహిళలు భజనలు చేస్తారు. అలా ఆరుగురు బాలికలను నగ్నంగా తిప్పుతుండగా తీసిన వీడియోలు కలకలం సృష్టించాయి. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ మండలి(ఎన్‌సీపీసీఆర్‌) అప్రమత్తమైంది. ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది.


Also Read:Heavy rains updates: ఈ జాబితాలోని రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. IMD నివేదిక


అయితే అంతకుముందు ఈ విషయంపై దామోహ్ ఎస్పీ తెనివర్(Damoh sp) స్పందించారు. ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం కారణంగా, గ్రామస్థులు పిల్లల అనుమతితోనే.. ఏటా ఈ విధంగా ఊరేగింపులు నిర్వహిస్తారని తెలిపారు. ఎవరైనా వారితో బలవంతంగా ఇలా చేయించారా.. లేదా అనేది విచారిస్తున్నామని తెలిపారు. ఒకవేళ వారితో బలవంతంగా చేయించారని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook