National Doctors Day: కష్టకాలంలో ప్రాణాల్ని లెక్కచేయని వైద్యులకు సెల్యూట్
National Doctors Day: కరోనా సంక్షోభంలో ముందు వరుసలో నిలిచింది నిరభ్యంతరంగా వైద్యులే. అందుకే ఆ వైద్యుల సేవల్ని గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా వైఎస్ జగన్, ప్రధాని మోదీలు శుభాకాంక్షలు అందించారు.
National Doctors Day: కరోనా సంక్షోభంలో ముందు వరుసలో నిలిచింది నిరభ్యంతరంగా వైద్యులే. అందుకే ఆ వైద్యుల సేవల్ని గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా వైఎస్ జగన్, ప్రధాని మోదీలు శుభాకాంక్షలు అందించారు.
ఇవాళ జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctors Day). కరోనా సంక్షోభ సమయంలో వైద్యుల సేవలు, త్యాగాలు కచ్చితంగా గుర్తుంచుకోదగ్గవిగా మారాయి. కష్టకాలంలో వైద్యులు ప్రాణాలకు ఎదురొడ్డి సేవలు చేస్తూ వస్తున్నారు. అందుకే జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు ఆ వైద్యులకు సెల్యూట్ చేస్తున్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందించారు. కరోనాతో చాలామంది వైద్యులు చనిపోయయారని..వైద్యుల భద్రతకు కఠిన చర్యలు చేపడుతున్నామని ప్రధాని మోదీ (Pm Narendra modi) తెలిపారు. వైద్యరంగానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నామన్నారు. వైద్యరంగంలో భారత్ పురోగమించడం అభినందించదగ్గ విషయమని చెప్పారు.
ఆరోగ్య విపత్తుల సమయంలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న వైద్యులు దైవంతో సమానమని..వారి సేవలు వెలకట్టలేనివని సీఎం జగన్ కొనియాడారు. కోవిడ్‌పై పోరాటంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవన్నారు. మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రాణాల్ని లెక్కచేయకుండా సేవలందించారని ప్రశంసించారు. కోవిడ్ పై పోరాటంలో వైద్యుల కుటుంబ సభ్యుల సహకారం అభినందనీయమని తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే..వైద్యులు పునర్జన్మనిస్తారని వైఎస్ జగన్(Ap cm ys jagan)చెప్పారు.
Also read: EU Green Pass: దిగివచ్చిన యూరోపియన్ యూనియన్, గ్రీన్‌పాస్‌లో కోవిషీల్డ్‌కు అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook