Rahul ED Office : దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేషనల్ హెరాల్ట్ కేసులో కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డెరైక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. మనీ లాండరింగ్ కేసులో రాహుల్ ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ ప్రధాన కార్యాలయానికి తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వచ్చారు రాహుల్ గాంధీ. తన నివాసం నుంచి సోదరితో కలిసి మొదట ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన రాహుల్ గాంధీ.. అక్కడి నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహుల్ కు ఈడీ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపిచ్చింది. దీంతో ఏఐసీసీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా పార్టీ కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లారు రాహుల్ గాంధీ. రాహుల్ వెంట పాదయాత్రగా వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమీపంలోనే వందలాది మంది అదుపులోనికి తీసుకున్నారు.


రాహుల్ కు మద్దతుగా ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. దేశ రాజధానిలో శాంతి భద్రతల దృష్ట్యా కాంగ్రెస్ మార్చ్‌కు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా మార్చ్ చేసి తీరుతామని కాంగ్రెస్ లీడర్లు ప్రకటించడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. రాహుల్ వెంట వస్తున్న కాంగ్రెస్ కేడర్ ను అదుపులోనికి తీసుకుని బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు. కాంగ్రెస్ ఆఫీసుతో పాటు రాహుల్ గాంధీ ఇంటిదగ్గర ఉదయం నుంచే భారీగా బలగాలను మోహరించారు. ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్‌ విధించారు. ఢిల్లీ పోలీసుల తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మొత్తం బారీకేడ్లు పెట్టారంటే కేంద్ర సర్కార్ కాంగ్రెస్ కు ఎంతగా భయపడుతుందో తెలుస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా అన్నారు. తమను ఎవరూ అణిచివేయలేరని కామెంట్ చేశారు.


Read Also: Hyderabad Gang Rape: జూవెనైల్ హోమ్ లో కొట్టుకున్న నిందితులు.. కార్పొరేటర్ కొడుకుపై దాడి  


Read Also: Siddhanth Kapoor: బెంగళూరులో డ్రగ్స్ పార్టీ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడి అరెస్ట్...   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.