Navratri 2020 Day 1: Worship Devi Shailputri for good fortune: అమరావతి: దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి (Navratri 2020 ) వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన ఆలయాలన్నీ అత్యంత భక్తిపారవశ్యంతో పులకించిపోయాయి. శనివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, లక్నో వంటి నగరాల్లోని ఆలయాలతో పాటు  జమ్మూకాశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయం, ఇంద్రకీలాద్రీపై వెలసిన కనదుర్గమ్మ ఆలయాల్లో 9రోజుల పాటు జరిగే శరన్నవరాత్రి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా (Vijayawada) ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారు ఈ రోజు.. శైలపుత్రి  (స్వర్ణకవచాలంకృత) దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. బంగారు కవచం ధరించి.. సువర్ణ కాంతులీనుతూ భక్తులకు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు. కాగా అమ్మవారి దర్శనానికి రోజుకు 10 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న భక్తులకే అమ్మవారి దర్శన భాగ్యం దక్కనుంది. Also read: Navratri 2020: అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ? ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?


[[{"fid":"195139","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"కనక దుర్గా దేవీ","field_file_image_title_text[und][0][value]":"కనక దుర్గా దేవీ"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"కనక దుర్గా దేవీ","field_file_image_title_text[und][0][value]":"కనక దుర్గా దేవీ"}},"link_text":false,"attributes":{"alt":"కనక దుర్గా దేవీ","title":"కనక దుర్గా దేవీ","class":"media-element file-default","data-delta":"1"}}]]


అమ్మవారి విశిష్టత:
నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నాడు కనకదుర్గ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టీ శైలపుత్రి అని పేరు వచ్చింది. సతీ, భవానీ, పార్వతి, హేమవతి అనే పేర్లు అమ్మవారికి కూడా ఉన్నాయి. అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటిరోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టే నవరాత్రుల మొదటిరోజు శైలపుత్రీ దుర్గాదేవిని ఆరాధిస్తారు.


శైలపుత్రీ దుర్గా ధ్యాన శ్లోకం:


అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ శ్లోకాన్ని భక్తులు పఠిస్తారు. ‘‘వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ " వృషభాన్ని అధిరోహించి, కిరీటంలో చంద్రవంకను ధరించి, యశశ్శు కలిగి, భక్తుల మనః వాంఛలను తీర్చే మాతా శైలపుత్రీ దుర్గా దేవికి నమస్కరిస్తున్నాను అని ఆ శ్లోకానికి అర్ధం.


అలంకరణ, నైవేద్యం:
అమ్మవారిని ఈ రోజు బంగారం, ఎరుపు రంగు చీరతో.. శైలపుత్రీ అవతారంలో అలంకరించి భక్తి భావంతో పూజిస్తారు. ఈ సందర్భంగా శైలపుత్రీ దేవికి చక్ర పొంగలి,పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. 
ALSO READ| Krishna : శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe