NCP MLA Saroj Babulal Ahire With Her Baby: మహారాష్ట్ర శాసనసభ వద్ద అరుదైన దృశ్యం కనిపించింది. నాసిక్‌లోని దేవ్‌లాలీ ఎమ్మెల్యే సరోజ్ అహిరే తన రెండు నెలల శిశువుతో రాష్ట్ర అసెంబ్లీకి చేరుకున్నారు. తన బిడ్డతో కలిసి ఆమె శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది సెప్టెంబర్ 30న దేవ్‌లాలీ ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ అహిరే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు  తన నవజాత శిశువుతో కలిసి ఆమె విధాన్ భవన్‌కు చేరుకున్నారు. ఆమె తన బిడ్డను అధికారిక సమావేశానికి తీసుకువెళుతున్న కెమెరాల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె తన చేతుల్లో నిద్రిస్తున్న శిశువును పట్టుకుని కనిపించింది.


నాగ్‌పూర్‌లో శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యాయి. మరోవైపు బీజేపీ ప్రభుత్వానికి, శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే వర్గానికి నిరసనగా విపక్షాలు ఆదివారం సంప్రదాయ టీ విందును బహిష్కరించాయి. 


ఎమ్మెల్యే అహిరే మీడియాతో మాట్లాడుతూ.. 'నేను తల్లితో పాటు ఎమ్మెల్యేను కూడా. ఈ రెండు విధులు ముఖ్యమైనవి. అందుకే నా బిడ్డను ఇక్కడకు తీసుకువచ్చాను. నా బిడ్డ చాలా చిన్నది. నేను లేకుండా ఉండలేదు. అందుకే బిడ్డను తీసుకురావాల్సి వచ్చింది. తన కుమారుడిని రోజూ శాసన సభకు తీసుకువస్తాను. మహిళా శాసనసభ్యులకు భోజనం చేసే గది లేదు. ప్రభుత్వం దీనిని పరిశీలించి శాసనసభ్యులు వారి కొత్తగా జన్మించిన పిల్లలను తమ వెంట తీసుకురావడానికి వీలుగా ఏదైనా ఏర్పాటు చేయాలని నేను భావిస్తున్నాను..' అని అన్నారు.


 



ఇక సరోజ్ బాబులాల్ అహిరే దేవ్‌లాలీ అసెంబ్లీ స్థానంపై గట్టి పట్టు ఉంది. ఆమె తండ్రి బాబూలాల్ సోమ అహిరే మరణం తర్వాత.. దేవ్‌లాలీ రాజకీయ వారసత్వాన్ని ఆమె కొనసాగిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సరోజ్ బంపర్ విజయం సాధించారు. సరోజ్ బాబులాల్ అహిరే 41,702 ఓట్ల భారీ తేడాతో శివసేనకు చెందిన యోగేష్ బాబన్‌రావ్ ఘోలప్‌పై గెలుపొందారు.


Also Read: Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు.. బీఆర్ఎస్‌లో కలకలం


Also Read: Man Injects Wife With HIV: భార్యకు హెచ్ఐవి బ్లడ్ ఇంజెక్షన్ ఇచ్చిన భర్త


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook