NEET PG Counselling 2021: ఇటీవల నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కౌన్సెలింగ్ ఏర్పాట్లకు కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాల నుంచి ఏఎన్ఐకి అందిన సమాచారం ప్రకారం.. బహుశా వచ్చే వారం నుంచే నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. తొలిసారిగా ఈసారి నీట్ పీజీ కౌన్సెలింగ్‌లో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీట్ పీజీ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ ఇలా :


మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఆధ్వర్యంలో నీట్ పీజీ కౌన్సెలింగ్ జరుగుతుంది. కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు మొదట mcc.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ సీట్లను భర్తీని నాలుగు విడతలుగా చేపట్టనున్నట్లు గతంలో ఎంసీసీ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంలో మార్పు ఉంటుందేమో చూడాలి.


నీట్ పీజీ కౌన్సెలింగ్‌ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో 50 శాతం సీట్లను భర్తీ చేస్తారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో 100 శాతం సీట్లు కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ అవుతాయి. అలాగే డీయూ/ఐ.పీ యూనివర్సిటీలో 85 శాతం స్టేట్ కోటా, ఈఎస్ఐసీలో 15శాతం ఐపీ కోటా సీట్లు భర్తీ అవుతాయి.


సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ :


నీట్ పీజీ ప్రవేశాల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీంతో ఈడబ్ల్యూఎస్ కోటాను పున:సమీక్షించాలని కేంద్రం నిర్ణయించగా.. ఆ కారణంగా పీజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. కౌన్సెలింగ్‌లో జాప్యాన్ని నిరసిస్తూ రెసిడెంట్ వైద్యులు నిరసనగా దిగగా... సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. కేంద్రం నిర్ణయించిన రిజర్వేషన్ల అమలుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీట్ పీజీ కౌన్సెలింగ్‌ను జాతీయ ప్రయోజనంగా భావించి త్వరగా ఆ ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రాన్ని ఆదేశించింది.


Also Read: Covid 19: 'సునామీ'లా విరుచుకుపడుతోన్న కరోనా.. వరుసగా మూడో రోజు లక్ష దాటిన కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి