NEET PG Counselling ప్రక్రియ నిలిచిపోయింది. రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నీట్ పీజీ కౌన్సిలింగ్‌ను నిలిపివేసింది. సుప్రీంకోర్టులో నీట్ పీజీ కౌన్సిలింగ్ వివాదమేంటంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NEET PG Counselling ప్రక్రియ వివాదాస్పదమై..నిలిచిపోయింది. ప్రస్తుతం అంటే 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, ఎండీ, ఎంఎస్, ఎండీఎస్ కోర్సుల్లో ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జూలై 29వ తేదీన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టులో(Supreme Court)పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీబీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ హాజరయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటాతో చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పిటీషనర్ల తరపు న్యాయవాదులు వాదన విన్పించారు. రిజర్వేషన్లు(Reservations in NET Admissions)ఇలా కేటాయించడం వల్ల జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోయి మైనార్టీలుగా మిగిలిపోతారని పిటిషనర్లు తెలిపారు. ఇది ప్రతిభావంతులకు అవకాశాలు నిరాకరించడమే అవుతుందని స్పష్టం చేశారు. 


పిటీషనర్ల వాదనపై విచారణ జరిపిన ధర్మాసనం..నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌‌ను(NEET PG Counselling)నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీట్‌‌లో రిజర్వేషన్ల చెల్లుబాటుపై నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్‌‌ను నిలిపివేయాలని ఆదేశించింది. రిజర్వేషన్లపై నిర్ణయం తేలకుండా కౌన్సెలింగ్‌‌ను ప్రారంభిస్తే విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు తీర్పు వచ్చేవరకూ కౌన్సిలింగ్ చేపట్టమని..నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి నీట్ పీజీ సీట్ల భర్తీకై కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 25 నుంచి ప్రారంభం కావల్సి ఉంది. మెడికల్, డెంటల్ అండర్ గ్యాడ్యుయేట్ కోర్సుల్లో 15 శాతం సీట్లు, పీజీ కోర్సుల్లో 50 శాతం సీట్లు అఖిల భారత కోటాలో ఉంటాయి. ఈ సీట్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం(Central government)నిర్ణయించడం వివాదాస్పదమైంది. 


Also read: Covid alert: దేశంలో మరో కొత్త వేరియంట్ కలకలం..! మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కేసులు నమోదు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook