NEET UG Exam Online దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ప్రతి యేటా NEET UG Exam జరుగుతుంటుంది. ఇది పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలో బబ్లింగ్ పద్ధతిలో జరిగే పరీక్ష. ఈసారి జరిగిన నీట్ పరీక్షపై పెద్దఎత్తున వివాదం చెలరేగింది. ఇప్పటికీ నీట్ వివాదం సద్దుమణగలేదు. ఈ నేపధ్యంలో నీట్ పరీక్ష విధానంలో మార్పు కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీట్ పరీక్ష సమగ్రతను కాపాడటం, పేపర్ లీకేజ్ ఘటనల్ని నివారించాలంటే ఆన్‌లైన్ పరీక్ష విధానం మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నీట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించే సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తోంది. జేఈఈ తరహాలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించేందుకు ఆలోచిస్తోంది. అదే జరిగితే ఎంత వరకూ సాధ్యమవుతుంది, విద్యార్ధులకు ప్రయోజనమా, నష్టమా అనేది పరిశీలిద్దాం. 


ప్రస్తుతం దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలకు దాదాపుగా 12 లక్షలమంది విద్యార్ధులు హాజరవుతున్నారు. ఆన్‌లైన్ విధానంలో 5-6  రోజుల్లో 10-12 దశలుగా ఈ పరీక్ష జరుగుతోంది. అంటే జేఈఈ పరీక్షకు దాదాపుగా 10-12 పేపర్లు సిద్ధం చేస్తున్నారు. దాంతో 12 రకాల పేపర్లు ఒకే విధంగా ఉండటం లేదు. కొన్ని హార్డ్‌గా ఉండవచ్చు , కొన్ని సులభంగా ఉండవచ్చు. 10-12 పేపర్లు ఒకే విదానంలో సెట్ చేయాలంటే కాస్ట కష్టమే.


నీట్ ఆన్‌లైన్ విధానంతో ప్రతికూలతలు


అలాంటిది నీట్ పరీక్షకు దాదాపుగా 25 లక్షలమంది హాజరవుతున్నారు. ప్రతి యేటా నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో నీట్ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తే ఒకేసారి జరపడం సాధ్యం కాదు. జేఈఈ మెయిన్స్ తరహాలోనే దశల్లో నిర్వహించాల్సి వస్తుంది. అందుకు తగ్గట్టే పేపర్లు సిద్ధం చేయాలి. నీట్‌కు సరాసరిన 25 లక్షలు హాజరైతే 10-12 రోజులు 20-22 దశల్లో నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే 25 లక్షలమందికి ఆన్‌లైన్ విధానంలో పరీక్ష అంటే అందుకు తగ్గ ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల్లో ఉండకపోవచ్చు. దాంతో 20-22 పేపర్లు సిద్ధం చేయాలి. ఇది కాస్తా విద్యార్ధులపై ప్రభావం చూపిస్తుంది. పేపర్ డైల్యూట్ అయ్యే అవకాశాలున్నాయి. కొందరికి కష్టంగా కొందరికి సులభంగా మారవచ్చు. 


నీట్ ఆన్‌లైన్‌తో విద్యార్ధులకు కలిగే లాభమిదే


వాస్తవానికి నీట్ ఆన్‌లైన్‌లో నిర్వహించడం వల్ల విద్యార్ధులకు ఒకే ఒక లాభం కలుగుతుంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్ విధానంలో ఉన్న బబ్లింగ్ పద్ధతితో విద్యార్ధులకు దాదాపుగా 15 నిమిషాలు సమయం వృధా అవుతోంది. అంతేకాకుండా బబ్లింగ్‌లో ఏ మాత్రం తేడా వచ్చినా మార్కులు పడవు. అదే ఆన్‌లైన్‌లో జరిగితే బబ్లింగ్ బాధలు తప్పుతాయి. కేవలం పరీక్షపైనే దృష్టి సారించవచ్చు. 15 నిమిషాల సమయం కూడా కలిసొస్తుంది. 


నీట్ ఆన్‌లైన్‌తో సాంకేతిక ఇబ్బందులు


అయితే నీట్ ఆన్‌లైన్ నిర్వహించేటప్పుడు సర్వర్ డౌన్, ఇంటర్నెట్ సమస్య, పేపర్ స్టక్ కావడం వంటి టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవల్సి ఉంంటుంది. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్‌కు టర్న్ కాకుండా స్టక్ అయినా లేక ఇంటర్నెట్ సమస్య వచ్చినా విద్యార్ధులకు ఇబ్బంది కలుగుతుంది. 


Also read: Neet UG Exam: నీట్ పరీక్ష ఇకపై ఆన్‌లైన్‌లో జరగనుందా, ఎందుకీ నిర్ణయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook