Mamata New Front: దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వస్తున్నాయి. కొత్త కూటముల కోసం ఓ వైపు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుండగా..మరోవైపు మమతా బెనర్జీ కూడా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ను కలుపుకుంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతీయ కూటమి దిశగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నారు. బీజేపీయేతర పార్టీలను కూడగట్టే పనిలో దీదీ నిమగ్నమైనట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో త్వరలో మమతా బెనర్జీ భేటీ కానున్నట్లు సమాచారం. అయితే ఈ జాతీయ కూటమిలో కాంగ్రెస్‌ను కూడా కలుపుకోకూడదని దీదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారు తృణమూల్ అధినేత్రి. ఇందుకోసం తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ తదితరులకు ఆహ్వానాలు వెళ్లినట్లు తెలుస్తోంది. భావసారూప్యం కల ఇతర ముఖ్యమంత్రులకు సైతం దీదీ ఆహ్వానాలు పంపనున్నట్లు తెలుస్తోంది. 


అయితే వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్, బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లను ఆహ్వానించాలా వద్దా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఆవిర్భవించేందుకు భావసార్యూతన కల అన్ని పార్టీలను ఒకే వేదిక పైకి  తెచ్చేందుకు ఈ భేటీ నిర్వహించనున్నట్లు తృణమూల్ వర్గాలు తెలిపాయి.


Also read: UP Polls 2022: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారు.. అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook