December 1 New Rules: డిసెంబర్ 1 నుంచి అమల్లో రానున్న కొత్త నిబంధనలు, మార్పులతో సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, బీమా, పాన్-ఆధార్ కార్డు లింకేజ్ వంటివి మారనున్నాయి. ఆధార్ కార్డు అప్‌డేట్, పెట్రోల్ ధరలు ఇలా చాలా అంశాలు మారవచ్చు. డిసెంబర్ 1 నుంచి ఏయే అంశాలు మారనున్నాయో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్య జీవితంలో ప్రతి పనికీ తప్పనిసరిగా మారిన ఆధార్ కార్డు విషయంలో కొత్త నియమ నిబంధనలు వచ్చి చేరుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి ఆధార్ కార్డు అప్‌డేట్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ప్రతి పదేళ్లకోసారి ఆధార్ కార్డు రివైజ్ చేయడం తప్పనిసరి అని యూఐడీఏఐ నిర్ణయించింది. నకిలీ ఐడీలు నిరోధించేందుకు, డేటా బేస్ అప్‌డేట్ చేసేందుకు ఈ ప్రక్రియ దోహదపడనుంది. మీ కార్డు కూడా పదేళ్ల నుంచి అప్‌డేట్ చేయకుంటే వెంటనే చేయండి. 


ఇక డిసెంబర్ 1 నుంచి బ్యాంకులు కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేయనున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి కేవైసీప అప్‌డేట్ తప్పనిసరిగా మారింది. డిసెంబర్ 1 నుంచి ప్రజలు ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం ప్రభుత్వం కొత్తగా నేషనల్ వెల్‌నెస్ పాలసీ అమలు చేస్తోంది. డిసెంబర్ 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ప్రయోజనాలు పెరగనున్నాయి. పదవీ విరమణ ప్రయోజనాలు అందుకోవడం మరింత సులభం కానుంది. అంతేకాకుండా డిసెంబర్ 1 నుంచి బీమా రంగంలో డిజిటల్ సేవల్లో మార్పు ఉండవచ్చు. పాలసీ కొనుగోలు, క్లెయిమింగ్, పాలసీ రెన్యువల్ అన్నీ ఆన్‌లైన్ విధానంలో ఉంటాయి. డిసెంబర్ 1 నుంచి నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించే దిశగా యూపీఐ, డిజిటల్ వ్యాలెట్ తప్పనిసరి కావచ్చు. 


ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు ప్రక్రియలో మార్పులు రావచ్చు. దీనికోసం ముందుగా ఐటీఆర్ ఫామ్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఇక జీఎస్టీ ఫైలింగ్ కూడా మారనుంది. ఇకపై నెల నెలా కాకుండా ప్రతి మూడు నెలలకోసారి జీఎస్టీ ఫైల్ చేయవచ్చు.ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు డిసెంబర్ 1 నుంచి కొత్తగా సబ్సిడీ పధకం అమలు కానుంది. 


ఇక అన్నింటికంటే ముఖ్యంగా డిసెంబర్ 1 నుంచి ఎల్పీజీ సబ్సిడీలో మార్పు రానుంది. గ్యాస్ కనెక్షన్ ఆధార్ కార్డు లింక్ చేసిన కస్టమర్లకే సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి పాత మాగ్నెటిక్ స్ట్రిప్ ఏటీఎం కార్డులు పనిచేయవు. చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేయాల్సిందిగా ఆర్బీఐ సూచించింది. మీరు కూడా మీ కార్డు చెక్ చేసుకుని అవసరమైతే మార్చుకోండి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. 


ఆధార్ కార్డు పాన్‌కార్డు లింకింగ్ గడువు డిసెంబర్ 1 చివరి తేదీగా ఉంది. ఆ తరువాత ఆధార్ కార్డుతో లింక్ కాని పాన్‌కార్డులు రద్దు కావచ్చు. 


Also read: IPL 2025 Full Teams: ఐపీఎల్ 2025 వేలం తరువాత 10 ఫ్రాంచైజీల ఫుల్ స్క్వాడ్ ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.