New Sim Card Rules: భారతదేశంలో టెలికాం నిబంధనల ప్రకారం.. 18 ఏళ్లు నిండిన వారికే సిమ్ కార్డ్స్ ను విక్రయిస్తున్నారు. ఆ వయసు నిండిన వారు తమకు ప్రభుత్వం జారీ చేసిన ధ్రువీకరణ పత్రంతో మొబైల్ కనెక్షన్ పొందేందుకు అవకాశం ఉంది. ఇప్పుడా నిబంధనలను భారత ప్రభుత్వం మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై కొత్త మొబైల్ కనెక్షన్ కోసం ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అలా ఆన్ లైన్ దరఖాస్తు చేసిన తర్వాత ఆ సిమ్ కార్డు సరాసరి ఇంటికే వస్తుంది. కానీ, కొంతమంది మాత్రం మొబైల్ కనక్షన్స్ ను పొందలేరు. వారేవరో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 ఏళ్లలోపు వ్యక్తులకు నో సిమ్!


తాజాగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మేరకు.. 18 ఏళ్లలోపు వినియోగదారులు కొత్త మొబైల్ ఫోన్ కనెక్షన్ ను పొందలేరు. ఒకవేళ సిమ్ కార్డును పొందినా.. 18 ఏళ్ల లోపు వారి వివరాలతో పాటు కొత్త కనెక్షన్స్ తీసుకున్న వారి వివరాలు డిజిలాకర్ లో స్టోర్ చేస్తారు. ఇదే విషయాన్ని కేంద్ర టెలికాం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 


రూ.1కే KYC


కేంద్ర టెలికాం శాఖ ప్రకటించిన ఉత్తర్వల ప్రకారం.. కొత్త మొబైల్ కనెక్షన్ కోసం UIDAI జారీ చేసిన ఆధార్ e-KYC కేవలం రూ.1 కే అందుబాటులో ఉంటుంది. 18 ఏళ్లలోపు వారికి సిమ్ కార్డు జారీ చేయకపోవడం సహా మానసిక అనారోగ్యంతో బాధపడే వారికి కొత్త సిమ్ కార్డు ఇవ్వరు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సదరు టెలికాం కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  


Also Read: Kacha Badam singer Bhuban: 'కచ్చా బాదమ్'​ సింగర్​కు రోడ్డు ప్రమాదం.. ఆస్ప‌త్రిలో చేరిక‌..


Also Read: Smartphones scheme: రైతులకు గుడ్​ న్యూస్​- స్మార్ట్​ఫోన్ కొంటే రూ.6000 సాయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook