Delhi Blast: దేశవ్యాప్తంగా కలవరం కల్గించిన ఢిల్లీ బాంబు పేలుళ్లు విషయంలో కీలకాధారాలు లభ్యమయ్యాయి. దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమానితుల ఫుటేజ్ విడుదల చేసింది. కేసు వివరాలిలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవరి 29, 2021న ఢిల్లీలో బాంబు పేలుడు(Delhi Bomb Blast) జరిగింది. అది కూడా ఢిల్లీలోని దౌత్య కార్యాలయం పక్కనే ఉన్న జిందాల్ హౌస్ ఎదురుగా ఉన్న పూలకుండీలో ఈ పేలుడు సంభవించింది. సాయంత్రం సమయంలో పేలుడు జరిగినా ఎవరికీ ఏం కాలేదు. అయితే ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం (Izrael Embassy)ఎదురుగా ఈ పేలుడు జరగడంతో కలవరం రేగింది. ఇజ్రాయిల్ , ఇండియాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై ఆ రోజుకు 29 ఏళ్లు పూర్తవడం విశేషం. ఇజ్రాయిల్‌కు ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇవ్వడాన్ని నిరసిస్తూ భారీ పేలుడుకు ప్రణాళిక రూపొందించారు. భద్రత గట్టిగా ఉండటంతో వ్యూహం ఫలించలేదు. 


ఈ ఘటనకు సంబంధించి అదేరోజు ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు అనుమానితుల ఫుటేజిని ఎన్ఐఏ (NIA) విడుదల చేసింది. ఈ ఫుటేజిలో ఇద్దరు యువకులు అటూ ఇటూ తిరుగుతూ కన్పించారు. ఓ యువకుడు కాస్త కుంటుతూ నడుస్తున్నాడు. ఈ ఫుటేజి ఆధారంగా ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది.




Also read: SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక..సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook