Nitin Gadkari Praises Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలకు గాను దేశమంతా ఆయనకు ఎంతగానో రుణపడి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక ఫలాలు ప్రజలు అందరికీ పంచిపెట్టేలా దేశానికి పూర్తి స్వేచ్ఛతో కూడిన ఆర్థిక విధానాలు అవసరమని నితిన్ గడ్కరి సూచించారు. 1991లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మన్మోహన్ సింగ్ తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాలు, ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను కొంగొత్త మార్గంలోకి నడిపించాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పేర్కొన్నారు. ఓ అవార్డ్ ఫంక్షన్ లో దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ నితిన్ గడ్కరి ఈ వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాల వల్లే దేశంలో రైతులకు, నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని నితిన్ గడ్కరి తెలిపారు. ట్యాక్స్ ఇండియా ఆన్ లైన్ అనే పోర్టల్ నిర్వహించిన అవార్డుల ప్రదానం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడుతూ నితిన్ గడ్కరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ దేశ అభివృద్ధికైనా ఆ దేశ ఆర్థిక సంస్కరణలు, విధానాలే కారణం అని చెప్పడానికి చైనానే ఒక ఉదాహరణ అని అన్నారు.  భారత్ లో ఆర్థిక వ్యవస్థను మరింత పరుగులు పెట్టించాలంటే దేశానికి క్యాపెక్ట్ పెట్టుబడి అవసరం అని అన్నారు. 


నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సైతం జాతీయ రహదారుల నిర్మాణం కోసం దేశాభివృద్ధిలో సామాన్యులను భాగస్వాములను చేస్తూ వారి నుంచి పైకాన్ని వసూలు చేస్తోందని అన్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరి జాతీయ రహదారుల అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం కేంద్ర రవాణా శాఖ దేశవ్యాప్తంగా 26 గ్రీన్ ఎక్స్ ప్రెస్ వేస్ నిర్మిస్తున్నాయని.. వీటి అభివృద్ధి కోసం నిధుల కొరత సమస్య లేనేలేదని అన్నారు. ప్రస్తుతం రూ. 40 వేల కోట్లుగా ఉన్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సంవత్సర ఆధాయం 2024 కి. 1 లక్షా 40 వేల కోట్లకు చేరుకుంటుందని నితిన్ గడ్కరి ( Nitin Gadkari ) ధీమా వ్యక్తంచేశారు.


Also Read : Ration Card: కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. ఆ రేషన్ కార్డులు రద్దు


Also Read : SMITHA Sabharwal : తెలంగాణలో జరిగే దారుణాలు కనిపించవా.. స్మితా సబర్వాల్ ట్వీట్ పై రచ్చ!


Also Read : Congress Twitter Accounts: కాంగ్రెస్ పార్టీకి KGF-2 కాపీ రైట్ యాక్ట్ కష్టాలు.. డేంజర్‌లో ట్విటర్ ఎకౌంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook