Ration Card Cancel List: రేషన్ కార్డుదారులకు అలర్ట్. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రేషన్ కార్డులు రద్దు కానున్నట్లు తెలుస్తోంది. దేశంలో సుమారు 10 లక్షల మంది ప్రజలు అక్రమంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వారందరీ రేషన్ కార్డులు రద్దవుతాయి. ప్రభుత్వం ఈ మేరకు జాబితాను సిద్ధం రెడీగా ఉంచింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్ సౌకర్యాన్ని పొందుతున్నారు. వీరిలో అనర్హులకు ఉచితంగా ప్రజలకు అందజేసే బియ్యం, గోధమలు, కందిపప్పు నిలిపివేయాలని కేంద్ర నిర్ణయించింది. అనర్హులందరీ పూర్తి జాబితాను రేషన్ డీలర్లకు పంపుతామని ప్రభుత్వం తెలిపింది. లిస్టు వారి వద్దకు చేరగానే.. నకిలీ కార్డులు కలిగిన వారికి రేషన్ ఆగిపోనుంది. రేషన్ డీలర్లు వారి పేర్లను జిల్లా కేంద్రానికి పంపిన తరువాత వారి కార్డులు రద్దు చేస్తారు.
ఆదాయపు పన్ను చెల్లించే వారి పేర్లు లేదా 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారి పేర్లు జాబితా నుంచి తీసివేయనున్నారు. అలాంటి వారికి ఇక నుంచి ఉచిత రేషన్ అందదు. అదే సమయంలో ఉచిత రేషన్‌తో వ్యాపారం చేసేవారిని కూడా ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా నాలుగు నెలలపాటు రేషన్ తీసుకోని వారి కార్డులు కూడా రద్దు చేసేందుకు రెడీ అవుతోంది. మొత్తం జాబితాను సిద్ధం చేసి.. రేషన్ డీలర్లకు పంపనుంది.
ప్రభుత్వ నిర్ణయంతో నకిలీ పద్ధతిలో రేషన్ పొందుతున్న దాదాపు 10 లక్షల మందికి సంబంధించిన కార్డులు రద్దు కానున్నాయి. అంతేకాదు రేషన్ కార్డు నకిలీదని తేలిన వారి నుంచి రేషన్ కూడా రికవరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా రేషన్‌కార్డులను నకిలీ పద్ధతి రేషన్ పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేషన్ కార్డుదారుల అర్హతలను పరిశీలించే ప్రక్రియను ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోంది.
Also Read: IND Playing XI vs ENG: కార్తీక్, అక్షర్ ఔట్.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో బరిలోకి దిగే భారత జట్టిదే!
Also Read: SBI Custmoers Alert: ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. మీకూ ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo