Coronastop: మరికొద్ది గంటల్లో ఆగనున్న విమాన ప్రయాణం..
రాష్ట్రం,దేశం,విశ్వం ఎక్కడచూసినా Lockdown.. సామాజిక స్పర్శను పాటించాలని, కట్టుదిట్టంగా అమలుచేయాలని, లేకపోతే ఇటలీ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే.. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా
న్యూఢిల్లీ: రాష్ట్రం,దేశం,విశ్వం ఎక్కడచూసినా Lockdown.. సామాజిక స్పర్శను పాటించాలని, కట్టుదిట్టంగా అమలుచేయాలని, లేకపోతే ఇటలీ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే.. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రైళ్ల రాకపోకలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా బుధవారం నుంచి దేశంలో వివిధ ప్రాంతాల మధ్య నడిచే విమానాలను రద్దు చేయనున్నట్టు, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది.
Also Read: కోల్ కతాలో మరో కరోనా మరణం.. 9కి చేరిన మృతుల సంఖ్య..
అంతర్జాతీయ విమాన ప్రయాణాలను ఇప్పటికే వారం రోజుల పాటు నిలిపివేయగా.. దేశీయ విమాన సర్వీసులన్నీ మంగళవారం రాత్రి 11.59లోగా తమ గమ్యస్థానాలకు చేరాల్సి ఉంటుందని సివిల్ ఏవియేషన్ సంస్థ తెలిపింది. కేవలం సరుకు రవాణా విమానాలకు అనుమతి ఉంటుందని, కాగా కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దేశంలో కరోనా మృతుల సంఖ్య 9కి చేరగా, కరోనా సోకిన వారి సంఖ్య 488గా నమోదైంది. ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చేందుకు విమాన ప్రయాణాలు నిలిపివేయబడ్డాయని తెలిపింది.
Also Read: అంతా అనుకున్నట్లుగానే.. మళ్ళీ అతడే..
దేశ రాజధానికి విమానాలను అనుమతించేది లేదని ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం రాత్రివరకూ దేశీయ విమానాలు వస్తాయని, తరువాత వీటిని నిలిపివేస్తారని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఒక ప్రకటన వెలువరించింది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోకి విమానాలను నిలిపివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధానికి లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో బస్సులు, రైళ్లు నిలిపివేశారని, అయితే ఇతర ప్రాంతాల నుంచి విమానాలు వస్తూనే ఉన్నాయని, దీంతో క్వారంటైన్ అంశం నీరుగారుతోంది ముఖ్యమంత్రి తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..