Coronaupdate: కోల్ కతాలో మరో కరోనా మరణం.. 9కి చేరిన మృతుల సంఖ్య..

Corona Death toll ప్రాణాంతక కరోనాతో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో కోల్‌కతాలో 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 

Last Updated : Mar 23, 2020, 08:23 PM IST
Coronaupdate: కోల్ కతాలో మరో కరోనా మరణం.. 9కి చేరిన మృతుల సంఖ్య..

కోల్ కతా: Corona Death toll ప్రాణాంతక కరోనాతో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో కోల్‌కతాలో 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 433కి చేరిందని, అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని, వైరస్ వ్యాప్తిని నిలువరించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసింది. కిట్ల తయారీకి ఐసిఎంఆర్ అనుమతి కోరామని, సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. 

Also Read: అంతా అనుకున్నట్లుగానే.. మళ్ళీ అతడే..

15 వేల కేంద్రాల్లో కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయని, ప్రైవేటు ప్రయోగశాలలు అనుమతినిచ్చిందని, కరోనా మహమ్మారి నిర్మూలనకు  యాంటీ మలేరియా వ్యాక్సిన్ పరీక్షలు సరిపోతాయని, ఐసిఎంఆర్ ప్రకటించింది. యాంటి మలేరియా వ్యాక్సిన్, హైడ్రో క్లోరోక్విన్ వ్యాక్సిన్ ను ధ్రువీకరించింది. కాగా యాంటీ మలేరియా వ్యాక్సిన్ సత్ఫలితాలనిచ్చిందని, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న వ్యక్తులకు యాంటి  మలేరియా వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొంది. 

Read Also: Coronacrisis: చైనాపై డొనాల్డ్ ట్రంప్ నిప్పులు...

మరోవైపు, లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని, ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ చట్టం ప్రకారం చేసిన ఏదైనా నిబంధనలు, ఉత్తర్వులను ఖాతరు చేసిన వారిపై, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లు పరిగణించబడుతుందని, ఇది ఆరు నెలల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా లేదా రెండింటికి దారితీస్తుంది. ఏదేమైనా, లాక్డౌన్ సమయంలో, అత్యవసరమైన సేవలను కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు ఆడిశెలు జారీ చేసింది. ఆసుపత్రులు, మెడికల్ స్టోర్స్, కిరాణా, కూరగాయల దుకాణాలు నిర్దిష్ట సమయానికి అందుబాటులో ఉంటాయని పేర్కొంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News