Kejriwal Cabinet: కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం.. అతిషికి నిరాశే!
ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేజ్రీవాల్ కేబినెట్ మంత్రులతో ఎల్జీ అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ‘సామాన్యుడు’ అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆప్ మంత్రులు ఒక్కొక్కరితో ఎల్జీ అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే అనూహ్యంగా కల్కాజీ నుంచి విజయం సాధించిన ఆప్ అభ్యర్థి అతిషి మర్లేనాకు కేజ్రీవాల్ తాజా కేబినెట్‌లో చోటు దక్కలేదు.
Also Read: సినిమా షూటింగ్ కాదు.. బెజవాడలో పెళ్లిసందడి
ఇంకా చెప్పాలంటే సామాన్యుడి మంత్రి వర్గంలో మహిళలకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సర్కార్ ముఖ్యంగా చెప్పిన అంశం విద్యావ్యవస్థను సంస్కరించడం. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దడం లాంటి కీలక బాధ్యతల్ని నిర్వహించిన వ్యక్తి అతిషి. కానీ కేజ్రీవాల్ తాజా మంత్రివర్గంలో ఆమెకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. కేజ్రీవాల్ మనసులో ఏముంది, ఆయన ఏం చేయాలనుకుంటున్నారన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
Also Read; ఆ హీరోయిన్ వచ్చిన వేళా విశేషం.. నితిన్‌కు పెళ్లి!
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 సీట్లకుగానూ 62 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. బీజేపీ 8 సీట్లకు పరిమితమైంది. ఆప్ నుంచి మొత్తం 9 మంది మహిళానేతలు పోటీ చేయగా 8 మంది విజయం సాధించారు. అయితే కేబినెట్‌లో అతిషికి కీలక పదవి దక్కుతుందని ఆప్ నేతలతో పాటు ఇతర పార్టీ వర్గాలు కూబా భావించాయి. మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళల భద్రత లాంటి చాలా అంశాలల్లో అతిషి విలువైన సూచనలు చేశారు. ఎన్నికల ప్రచారంలో మహిళా విభాగం తరఫున కీలకపాత్ర పోషించిన అతిషికి కేజ్రీవాల్ కేబినెట్ బెర్తు దక్కలేదు.
Also Read: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్!
అతిషి విషయాన్ని పక్కనపెడితే.. మంగోల్ పురి నుంచి విజయం సాధించిన ఆప్ అభ్యర్థి రాకీ బిర్లా కేబినెట్‌లో చోటు కోల్పోయారు. 74,100 మెజార్టీతో భారీ విజయం సాధించిన ఆమె మరోసారి కేజ్రీవాల్ మంత్రివర్గంలోకి వెళ్తారని అంతా భావించారు. కానీ రాకీ బిర్లాతో పాటు పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన అతిషిలకు కేబినెట్‌లోకి అవకాశం కల్పించలేదు. మహిళలకు ప్రాధాన్యంలేని ప్రభుత్వమంటూ విపక్షాలు కామెంట్ చేస్తున్నాయి.