Noida Twin Towers Demolition Today: నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత.. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ఈ అంశం మీడియాలో ఎక్కువగా ఫోకస్ అవుతోంది. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. అక్రమంగా నిర్మించిన ఈ టవర్స్‌ను నేటి (ఆగస్టు 28) మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేయనున్నారు. దాదాపు 9 ఏళ్ల పాటు కోర్టుల్లో నలిగిన ఈ వ్యవహారానికి 9 సెకన్లలో ఎండ్ కార్డ్ పడనుంది. కేవలం 9 సెకన్లలో నోయిడా ట్విన్ టవర్స్‌ను కూల్చివేసేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కూల్చివేతకు సంబంధించిన టాప్ పాయింట్స్‌ను ఒకసారి పరిశీలిద్దాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నోయిడా ట్విన్ టవర్స్‌ను ఎందుకు కూల్చివేస్తున్నారు :


సూపర్‌టెక్ లిమిటెడ్ అనే సంస్థకు 2004లో 'ది న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (NOIDA) హౌసింగ్ సొసైటీ నిర్మాణానికి స్థలం కేటాయించింది. ఎమరాల్డ్ కోర్టు పేరిట సూపర్‌టెక్ సంస్థ దీన్ని నిర్మించాలనుకుంది. ఒక్కో టవర్‌లో 10 ఫ్లోర్స్‌ చొప్పున 14 టవర్స్ నిర్మాణానికి 2005లో అనుమతులు లభించాయి. టవర్స్ ఎత్తు 37 మీటర్లకు మించకూడదనే నిబంధన ఉంది.
2006లో అదే చోట సూపర్‌టెక్ సంస్థకు అదనపు స్థలం కేటాయించబడింది. అంతకుముందు జారీ చేసిన నిబంధనలకు లోబడి నిర్మాణాలు జరపాల్సి ఉంది.


కానీ సూపర్‌టెక్ సంస్థ 2009లో ప్లాన్ మార్చేసింది. మరో రెండు టవర్స్‌ను ప్రాజెక్టులో చేర్చింది. ఆ రెండు టవర్సే అపెక్స్, కెయన్. ఒక్కో టవర్‌లో 24 అంతస్తులు నిర్మించేందుకు మొదట ప్లాన్ చేశారు. 2012లో ఆ సంఖ్యను 40కి పెంచారు. ఒరిజినల్ ప్లాన్‌కు ఇది పూర్తిగా విరుద్ధం.


9 ఏళ్ల పాటు కొనసాగిన న్యాయ విచారణ :


సూపర్‌టెక్ సంస్థ నిర్మించిన ఎమరాల్డ్ కోర్టులో ఫ్లాట్స్ కొనుగోలు చేసినవారు ఎమరాల్డ్ కోర్టు ఓనర్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌గా ఏర్పడి ఆ సంస్థ నిబంధనలు ఉల్లంఘించడంపై 2012లో అలహాబాద్ కోర్టులో కేసు వేశారు. 2014లో ట్విన్ టవర్స్ కూల్చివేతకు అలహాబాద్ కోర్టు ఆదేశాలిచ్చింది. అందులో ఫ్లాట్స్ కొనుగోలు చేసినవారికి చెల్లించిన మొత్తంపై 14 శాతం వడ్డీ చొప్పున తిరిగిచ్చేయాలని ఆదేశించింది. దీనిపై సూపర్‌టెక్ సంస్థ 2021లో సుప్రీం కోర్టును ఆశ్రయించగా అలహాబాద్ హైకోర్టు తీర్పును న్యాయస్థానం సమర్థించింది. ట్విన్ టవర్స్ కూల్చివేతకు సెప్టెంబర్ 4 వరకు డెడ్ లైన్ విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. కానీ ఆగస్టు 28నే కూల్చివేత పూర్తి చేస్తామని.. కూల్చివేత పనులు చేపడుతున్న ఎడిఫిస్ ఇంజనీరింగ్ సంస్థ కోర్టుకు వెల్లడించింది.


9 సెకన్లలో కుప్పకూలనున్న ట్విన్ టవర్స్ :


100 మీ. ఎత్తయిన నోయిడా ట్విన్ టవర్స్‌ను కేవలం 9 సెకన్లలో కూల్చివేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం టవర్స్ పిల్లర్స్‌కి 7000 రంధ్రాలు చేసి అందులో 3700 కిలోల పేలుడు పదార్థాలు అమర్చారు. కూల్చివేత సమయంలో కేవలం 10 మంది అధికారులు మాత్రమే అక్కడ ఉండి పర్యవేక్షించనున్నారు. కూల్చివేత సమయంలో నోయిడా ఎక్స్‌ప్రెస్ వే‌పై రాకపోకలను నిలిపివేయనున్నారు. కూల్చివేతకు 9 సెకన్లు, గాల్లోకి వెలువడే దుమ్ము,ధూళి పోవడానికి మరో 12 సెకన్ల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కూల్చివేత సమయంలో రిక్టర్ స్కేలుపై 0.4 మ్యాగ్నిట్యూడ్‌కి సమానమైన ప్రకంపనలు వెలువడుతాయని చెబుతున్నారు.


Also Read: Horoscope Today August 28th 2022: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు..   


Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందో తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook