రూ.2000 కరెన్సీ (Currency Notes ) నోటు ముద్రణను ప్రభుత్వం నిలిపివేయనున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు రావడం తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై పార్లమెంట్ లో ( Parliament ) ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వీటి ముద్రణను నిలిపివేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ| NPS Alert: NPS ఖాతాదారులకు శుభవార్త.. ఇంట్లో కూర్చొనే నామినీ వివరాలు మార్చే సదుపాయం


ఆర్బీఐ సలహా మేరకు నిర్ణయం తీసుకుంటాం


నోట్ల ముద్రణ గురించి వస్తున్న వార్తలపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ టాకూర్... వీటిని నిలిపివేయడంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని తెలిపారు.  ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI) సలహాలు, సూచనలు తీసుకుంటుంది అని తెలిపారు. కరెన్సీ సమతుల్యతను కాపాడటంలో ఇది సహకరిస్తుంది అని ఆయన తెలిపారు.


2019-20, 2020-21 మధ్య కాలంలో రూ.2000 కరెన్సీ నోట్ల ముద్రణను కొనసాగించేలా ఎలాంటి ఆర్డర్లు జారీ చేయలేదు. ఈ నోట్లను ముద్రించడంపై  ప్రభుత్వం ఎలాంటి మార్గనిర్దేశకాలు, ముద్రణ  ఆర్డర్లు ఈ మధ్య కాలంలో జారీ చేయలేదు అని తెలిపారు.



ALSO READ| Money Making: ఇంట్లోనే మహిళలు డబ్బు సంపాదించే 5 మార్గాలు


మళ్లీ మొదలైన ముద్రణ
మార్చి 31, 2020 వరకు దేశ వ్యాప్తంగా 27,398 ల రూ.2000 కరెన్సీ నోట్లు ముద్రణ జరిగాయి. ఈ సంఖ్య మార్చి 31, 2019 నాటికి 32,910 గా ఉంది అని అనురాగ్ టాకూర్ తెలిపారు.రోనావైరస్  (Coronavirus ) వల్ల ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల కరెన్సీ నోట్ల ముద్రణ నిలిచిపోయింది. అయితే ఇటీవల కాలంలో కరెన్సీ నోట్ల ముద్రణ మళ్లీ అంచెలంచెలుగా ప్రారంభం అయింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు, నిర్ధేశాలకు అనుగుణంగా వీటిని ప్రారంభించినట్టు తెలిపారు.


రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథ్యంలో నోట్ల ముద్రణ జరుగుతుంది. కరోనావైరస్ సంక్రమణ వల్ల మార్చి 23, నుంచి మే 3 వరకు నోట్ల ముద్రణను ఆర్బీఐ తాత్కాలికంగా నిలిపివేసింది.



ALSO READ| Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే..



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే   ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR