Navodaya Vidyalaya Notification 2024: నవోదయ విద్యాలయ సమితి డైరెక్ట్‌ రిక్రూట్మెంట్‌ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,377 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. నాన్‌ టీచింగ్‌ పోస్టులకు గాను దేశవ్యాప్తంగా ఈ దరఖాస్తులను స్వీకరించనుంది. అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదివి అప్లై చేసుకోగలరు. వివరాలు ఇలా ఉన్నాయి..ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్‌లో విభాగంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌, ఫీమేల్ నర్స్, ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్, మెస్ హెల్పర్, ఎంటీఎస్ వంటి వివిధ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ navodaya.gov.in. ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నవోదయ విద్యాలయాల్లో భర్తీ చేయనున్నారు. కచ్ఛితంగా ఉద్యోగ భర్తీల్లో మార్పుల చేర్పులు అనేటివి మొదటగా ఉండవు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా దరఖాస్తు చేసుకోండి..
ముందుగా navodaya.gov.in ద్వారా అప్లై చేసుకోవాలి.
హోంపేజీలో నోటిఫికేషన్ / వెకెన్సీ సెక్షన్ ఎంపిక చేసుకోవాలి.
నోటిఫికేషన్ డైరెక్ట్‌ రిక్రూట్మెంట్‌ 2024 నాన్ టీచింగ్‌ వివిధ పోస్టులు ఉంటాయి దాని పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఓ పీడీఎఫ్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ వివరాలు క్షణ్నంగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.


ఇదీ చదవండి:  సెబీ రిక్రూట్మెంట్‌ 2024.. రూ. 90,000 జీతంతో ఉద్యోగం.. ఇలా అప్లై చేసుకోండి..


ఎంపిక విధానం..
నవోదయ పోస్టుల భర్తీకి ఎంపిక విధానంలో మొదటగా రాత పరీక్ష నిర్వహిస్తారు.  ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఫీమేల్ స్టాఫ్ నర్స్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ రూ. 500 చెల్లించాలి. ఇతర పోస్టులకు వెయ్యి రూపాయలు ఉన్నాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 


ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. కవిత భర్తకు కూడా ఈడీ నోటీసులు..
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook