Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. కవిత భర్తకు కూడా ఈడీ నోటీసులు..

Enforcement Directorate: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ కు ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కవితకు ఏడురోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు, తాజాగా, ఆమె భర్త అనిల్ కుమార్ తమ ఎదుట హజరుకావాలని నోటీసులు జారీచేశారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Mar 16, 2024, 07:55 PM IST
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత భర్తకు నోటీసులు..
  • సోమవారం ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు..
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. కవిత భర్తకు కూడా ఈడీ నోటీసులు..

ED Issued Notice to BRS MLC k kavithas Husband Dr anil kumar: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ కు ఊహించని ఎదురుదెబ్బలు ఎదురౌతున్నాయి. ఇప్పటికే ఈడీ ఢిల్లీ ఈ స్కామ్ లో ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితను మార్చి 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్ కు ఆదేశిస్తు కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక మరోవైపు కవితకు ఒక్కసారిగా హైబీపీకి గురైనట్లు సమాచారం. వెంటనే వైద్యులు ఆమెకు టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంనిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read More: Eating More Pythons: జస్ట్ ఫర్ ఏ చెంజ్... కొండ చిలువలను తినాలంటున్న పరిశోధకులు... కారణం ఏంటంటే..?

మరోవైపు జ్యూడిషియల్ కస్టలో ఉన్నప్పుడు ఆమెకు ఇంటి నుంచి భోజనం, ప్రతిరోజు లాయర్లు,కుటుంబ సభ్యులను కలిసేలా వెసులుబాటు ఇవ్వాలని, ఆమె కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు ఇంటిఫుడ్ పంపడానికి, ప్రతిరోజు కుటుంబ సభ్యులతో మిలాఖత్ కు అనుమతినిచ్చింది. ఇదిలా ఉండగా.. మరోవైపు ఈడీ అధికారులు కవిత భర్త అనిల్ కు కూడా నోటీసులు జారీచేశారు.

సోమవారం తమ ముందు హజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత భర్తతో పాటు, ఆమె ముగ్గురు వ్యక్తిగత సిబ్బందికి కూడా నోటీసునలు అందించారు. ఇప్పటికే వారి ఫోన్టను కూడా సీజ్ చేసినట్లు సమాచారం. నిన్న హైదరాబాద్ లో కవిత భర్త వ్యాపారాలపై ఆరాతీసిన ఈడీ, తాజాగా నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ఇక.. దేశంలో ఒకవైపు సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఇక, మరో వైపు తెలంగాణలో లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఘటన దేశంలోని రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈడీ అధికారులు నిన్న మధ్యాహ్నం నుంచి ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవిత ఇంట్లో సోదాలు చేసి, ఆమె ఉపయోగించిన ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా ఆమెను రాత్రికి రాత్రే అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు.ఈ సమయంలో కవిత ఇంట్లో పెద్ద హైడ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు. కల్వకుంట్ల కవిత ఇంట్లో ఈడీ అధికారులు వచ్చారని తెలియగానే కేటీఆర్, హరీష్ రావు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కవిత ఇంటికి చేరుకున్నారు. మొదట కేటీఆర్, హరీష్ రావును కూడా ఈడీ అధికారులు లోపలికి అనుమంచలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

Read More: Lok Sabha Elections 2024: దేశంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు..

ఇక మరోవైపు.. కేటీఆర్, ఈడీ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. ఒకనోక సమయంలో కేటీఆర్, ఈడీ అధికారులను తీవ్రంగా ఎండగట్టారు. ఒక మహిళా నాయకురాలిని, ఎలాంటి ట్రాన్సిట్ నోటీసు లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ కూడా వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టులో ఈడీ అధికారులు అరెస్టు చేయమని చెప్పి,ఇలా దొడ్డి దారిన వచ్చి సోదాలేంటని మండిపడ్డారు. అదేవిధంగా.. ఇవి కేవలం ప్రధాని మోదీ, సీఎం రేవంత్ ల కుట్రలని వ్యాఖ్యానించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News