Garden City: సిలికాన్ సిటీ బెంగళూరుకు జై కొడుతున్న ప్రవాస భారతీయులు
Garden City: గార్డెన్ సిటీగా పేరు గాంచిన బెంగళూరు నగరానికి దేశంలో ప్రత్యేక స్థానముంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే కారణంగా బెంగళూరులో స్థిర నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రవాస భారతీయులు.
Garden City: గార్డెన్ సిటీగా పేరు గాంచిన బెంగళూరు నగరానికి దేశంలో ప్రత్యేక స్థానముంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే కారణంగా బెంగళూరులో స్థిర నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రవాస భారతీయులు.
దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటి బెంగళూరు(Bengaluru).వేసవిలో చల్లగా ఉండటం, గార్డెన్ సిటీ కారణంగా అందరూ బెంగళూరు వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దేశానికి వస్తున్న ఎన్నారైలలో ఎక్కువ మంది బెంగళూరులో నివాసానికి మొగ్గు చూపుతున్నారు. అత్యంత నివాసయోగ్యమన నగరం కావడంతో ఉద్యాన నగరికి డిమాండ్ పెరుగుతోంది. పెద్ద ఎత్తున ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. విలాసవంతంగా ఉండే ఇళ్లంటే ప్రవాస భారతీయులు ( NRIs) మక్కువగా ఉన్నారు. మూడు, లేదా నాలుగు బెడ్ రూమ్స్ ఉన్న ఇండిపెండెంట్ ఇళ్ల కొనుగోలుకు పోటీ ఉంది. విదేశాల్లో ఉండి తిరిగొచ్చేవారు సొంతూరులో కంటే బెంగళూరులో స్థిరపడేందుకే మొగ్గు చూపిస్తున్నారు. సిలికాన్ సిటీలో స్థిర నివాసానికి ప్రయత్నిస్తున్నారు.
బెంగళూరు తరువాత పూణే (Pune) ఎక్కువగా ఇష్టపడుతున్నారు. రూపాయి విలువ తగ్గే కొద్దీ డాలర్ లేదా పౌండ్‌కు ఎక్కువ రూపాయలు వస్తుండటంతో ఎన్నారైలు ఇండియాలో ఆస్థులు కొనుగోలు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నారైలతో 73 శాతం మంది దాదాపు 2.5 కోట్ల పెట్టి ఇళ్లు కొనడానికి సిద్ధంగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. బెంగళూరులోని షార్జాపుర రోడ్డు, ఎలక్ట్రానిక్ సిటీ , బన్నేరుఘట్ట రోడ్, వైట్‌ఫీల్డ్ , నెల మంగళ, కనకపుర రోడ్డు, మైసూరు రోడ్డు ప్రాంతాల్లో ఎన్నారైలు ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Also read: Assembly Elections: కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రారంభమైన పోలింగ్, ఓటేసిన ప్రముఖులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook