Odisha Assembly Election Results: సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగిన సమయంలో ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆసక్తికరంగా సాగాయి. తిరుగులేని విజయాలతో రెండున్నర దశాబ్దాలుగా ఏకచత్రాధిపత్యం చేస్తున్న నవీన్‌ పట్నాయక్‌ ఓటమి పాలయ్యారు. దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేస్తున్న ఆయనను ఒడిశా ప్రజలు తిరస్కరించారు. అక్కడ ఒడియా ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ అనూహ్యంగా అత్యధిక స్థానాలను సొంతం చేసుకుని అధికారాన్ని చేపట్టబోతున్నది. ఇక అధికార బిజూ జనతా దళ్‌ పార్టీ ఓటమి అంచున నిలబడింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేను


 


ఒడిశాలో బీజేడీ దాదాపు 25 ఏళ్లుగా పరిపాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. రెండున్నర దశాబ్దాలుగా పరిపాలిస్తున్న నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సుదీర్ఘ పాలనలో అభివృద్ధి కానరాకపోవడంతో ప్రజలు అధికారం మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. బీజేడీ వర్సెస్‌ బీజేపీ అనేలా సాగిన పోరులో కాషాయ పార్టీ పైచేయి సాధించి ఒడిశాలో ప్రభుత్వాన్ని నెలకొల్పబోతున్నది.

Also Read: AP Election Results: జగన్‌ దారుణ ఓటమికి కారణాలు ఇవే.. అవే చావుదెబ్బ తీశాయా?


అయితే ఈ సారి నవీన్‌ పట్నాయక్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆయన రెండు స్థానాల్లో పోటీ చేయగా.. వాటిలో ఒక స్థానంలో ఆయనను ప్రజలు ఓడించారు. కాంటాబంజి అసెంబ్లీ నియోజకవర్గంలో నవీన్‌ గెలవగా.. హింజిలి నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. ఇక ఒడిశాలోని లోక్‌సభ స్థానాల్లోనూ అదే ఫలితం పునరావృతమైంది. మొత్తం 21 ఎంపీ స్థానాలు ఉండగా 18 చోట్ల బీజేపీ విజయం సాధించింది. రెండు చోట్ల బీజేడీ, ఒక చోట కాంగ్రెస్‌ పార్టీ తన ప్రభావాన్ని చూపించింది.


రికార్డు విజయం
ఒడిశా రాష్ట్రాన్ని నవీన్‌ పట్నాయక్‌ దాదాపు 24 ఏళ్లుగా ఏకచత్రాధిపత్యం చేస్తున్నారు. అయిదు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తిరుగులేని అధినేతగా కొనసాగుతున్న ఆయనకు ఈసారి పరాభవం ఎదురైంది. 2000 నుంచి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న నవీన్‌ పట్నాయక్‌ తాజా ఫలితాలతో తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. 2000 సంవత్సరం నుంచి 2024 వరకు ఆయన సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేయడం విశేషం. ఈ ఎన్నికల్లో కూడా గెలిచి ఉంటే ముఖ్యమంత్రిగా నవీన్‌ పట్నాయక్‌ సరికొత్త చరిత్ర సృష్టించేవారు. కానీ ఆ అవకాశాన్ని ఒడిశా ప్రజలు ఇవ్వలేదు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter