ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పాజిటీవ్ కేసులో భారత్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజా కేసులతో కలిపితే కోవిడ్19 (COVID-19) బాధితుల సంఖ్య 110కి పెరిగింది. ఇప్పటివరకూ కరోనా ప్రభావం లేని రాష్ట్రాల్లో సైతం కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. ఒడిశాలో తొలి కరోనా పాజిటీవ్ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో సైతం ఆదివారం తొలి కరోనా పాజిటీవ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అత్యధికంగా మహారాష్ట్రలో 31 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడం అక్కడివారిని ఆందోళనను రెట్టింపు చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?


అయితే ఒడిశాకు చెందిన వ్యక్తి ఇటీవల విదేశాలకు వెళ్లివచ్చినట్లుగా భావిస్తున్నారు. ఇటీలీకి వెళ్లి వచ్చిన వ్యక్తికి కోవిడ్19 టెస్టులు చేయగా.. ఫలితాలలో తాజాగా పాజిటీవ్‌గా తేలినట్లు సమాచారం. అయితే కరోనా పేషెంట్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా, చైనా తర్వాత కరోనా ఎక్కువగా ప్రభావం చూపిన దేశాల్లో ఇటీలీ రెండో స్థానంలో ఉంది. చైనాలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టగా.. ఇటలీలో కరోనా పాజిటీవ్ కేసులతో పాటు మరణాలు భారీగా సంభవించడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. 


Read also : ఆ తప్పిదంతోనే భారత్‌లో తొలి కరోనా మరణం!


మరోవైపు తెలంగాణలో సైతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. ఫలితంగా తెలంగాణ ప్రజల్లో కరోనాపై భయాందోళన పెరుగుతోంది. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన యువకుడు (కరోనా పేషెంట్) పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జి కావడం తెలిసిందే. దీంతో కరోనా నుంచి కొన్ని చర్యలతో బయటపడవచ్చన్న నమ్మకం సైతం ప్రజల్లో ఉంది. కరోనాతో దేశంలో కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారు. కర్ణాటక వ్యక్తితో పాటు ఢిల్లీలో ఓ మహిళ కరోనా బారిన పడి చనిపోయారు.


See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా  


కరోనా కథనాల కోసం క్లిక్ చేయండి


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..