Signal Failure: ఒడిశా బహానగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వర్సెస్ గూడ్స్ రైలు వర్సెస్ యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రమాదం దేశమంతటినీ ఉలిక్కిపడేలా చేసింది. 300 మంది ప్రాణాలకు కారణం సిగ్నల్ లోపమేనని రైల్వే జాయింట్ కమిటీ తేల్చింది. నివేదికను వెలువరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశమంతా ఉలిక్కిపడేలా చేసిన ఘోర రైలు ప్రమాదం. ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోగా 1000 మంది వరకూ గాయాలపాలైన విషాధ ఘటన. దశాబ్ద కాలంలో అత్యంత ఘోరమైన ప్రమాదమిది. మూడు రైళ్లు ఒకదానికొకటి గుద్దుకున్న వైనం. పెనువేగంతో షాలిమార్ నుంచి చెన్నైకు వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పి చెల్లాచెదురైంది. ఈలోగా పక్క ట్రాక్‌పై బెంగళూరు నుంచి వస్తున్న యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోరమాండల్ భోగీల్ని కొట్టుకుంటూ ముందుకెళ్లి పట్టాలు తప్పింది. దాంతో ప్రమాద తీవ్రత పెరిగి మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనపై రైల్వే శాఖ సంయుక్త తనిఖీ కమిటీ కారణాలేంటో తేల్చింది. సిగ్నల్ సమస్యే ఈ ప్రమాదానికి కారణమని స్పష్టం చేసింది. ఆ సిగ్నల్ వ్యవస్థ లోపం ఎలా జరిగిందో వివరించింది. 


ప్రమాదం ఎలా జరిగిందంటే...


1. జూన్ 2వ తేదీ సాయంత్ర 6.52 గంటలకు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బహనగ బజార్ రైల్వేస్టేషన్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
2. రైల్వే స్టేషన్‌కు అటూ ఇటూ రెండు లూప్ లైన్లు, రెండు మెయిన్ లైన్లు ఉన్నాయి.
3. పాసెంజర్ హాల్ట్ స్టేషన్ కావడంతో ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్ ఫాస్ట్ రైళ్లు వచ్చినప్పుడు గూడ్స్ రైళ్లను లూప్ లైన్లకు తరలించడం సాధారణంగా జరిగే ప్రక్రియ
4. జూన్ 2వ తేదీ సాయంత్రం గూడ్స్ రైలు ముందుగానే ఈ స్టేషన్‌కు చేరుకుంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వచ్చే సమయం కావడంతో గూడ్స్ రైలును లూప్ లైన్‌కు తరలించారు.
5. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వెళ్లాల్సిన మెయిన్ లైన్‌పై రెడ్ సిగ్నల్ ఉంది. 17ఏ స్విచ్ నొక్కి గ్రీన్‌గా మారిస్తే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్ నుంచి వెళ్లిపోయేది. ప్రమాదం తప్పేది. కానీ సిబ్బంది ఆ స్విచ్ నొక్కినా పనిచేయలేదు. సిగ్నల్ ఇచ్చి మళ్లీ వెనక్కు తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఫలితంగా రెడ్ సిగ్నల్ కొనసాగడంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్‌లో వెళ్లి గూడ్స్ రైలును బలంగా ఢీ కొట్టింది.
6. ఆ సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకూ ఉన్నట్టు సమాచారం. దాంతో కోచ్‌లు ఎగిరి పక్కనున్న రెండవ మెయిన్ లైన్‌పై పడ్డాయి.
7. ఈలోగా ఆ ట్రాక్‌పై బెంగళూరు నుంచి హౌరాకు గంటకు 116 కిలోమీటర్ల వేగంతో వస్తున్న యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ చివరి భోగీలపై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ భోగీలు ఎగిరొచ్చి పడ్డాయి. ఈ రైలు 3-5 సెకన్లు ముందు వచ్చుంటే ప్రమాద తీవ్రత తగ్గుండేది. 


Also read: Black Friday: మరో బ్లాక్ ఫ్రైడే, 14 ఏళ్ల క్రితం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం, 14 తరువాత మళ్లీనా


ఒడిశా రైలు ప్రమాదం ఘటనలో ఇప్పుడు తేలాల్సింది ఒక్కటే. 17ఏ స్విచ్ నిజంగా పని చేయలేదా లేదా సిగ్నల్ ఇచ్చి వెనక్కి తీసుకున్నారా అనేది తేలాలి. ఒకవేళ సిగ్నల్ ఇచ్చి వెనక్కి తీసుకుని ఉంటే ఆ పని ఎందుకు చేశారో తెలియాలి. కొందరు ఆరోపిస్తున్నట్టు కుట్రకోణం ఉందా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సి ఉంది. 


Also read: Odisha Train Tragedy: ఎంతటి వారినైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook