What Is Kavach System: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్రవిషాదం నింపింది. ఈ ఘోర దుర్ఘటనలో 278 మరణించగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. సిగ్నల్‌ లోపం కారణంగా ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయగా.. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. లూప్‌లైన్‌ వద్ద ఆగి ఉన్న గూడ్స్‌ను కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మెయిన్‌లైన్‌పై వెళ్లేందుకే కోరమాండల్‌కు సిగ్నల్‌ ఇవ్వగా.. పొరపాటున లూప్‌లైన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ప్రమాద ఘటనపై భిన్నవార్తలు వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైలు ప్రమాదాలను నిలువరించేందుకు కవాచ్ వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ కొద్ది నెలల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. రెడ్‌ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్‌ అలానే ముందుకు వెళితే.. ఆటోమేటిక్‌గా బ్రేకులు పడేవిధంగా ఏర్పాటు చేశారు. బాలాసోర్‌ రైలు ప్రమాదం ఘటన కవాచ్ వ్యవస్థ ఏమైందని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ మార్గంలో కవాచ్ వ్యవస్థను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. 


కవాచ్ అనేది భారతీయ రైల్వేస్ ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్ సిస్టమ్. ఈ వ్యవస్థ ద్వారా రైలు ప్రమాదాలను నివారించడానికి రైల్వేలు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం కొన్ని మార్గాల్లోనే అందుబాటులోనే తీసుకువచ్చింది. ఇది రైల్వే సిగ్నల్ సిస్టమ్‌తో పాటు ట్రాక్‌లపై నడుస్తున్న రైళ్ల వేగాన్ని నియంత్రిస్తుంది. దీని ద్వారా రైలు ప్రమాదాలకు చెక్ పడుతుందని అధికారులు చెబుతున్నారు. కోరమాండల్ రైలు ప్రమాదానికి సంబంధించి ఈ రైలులో కవాచ్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదని వెల్లడిస్తున్నారు. ఈ వ్యవస్థ ఉంటే.. రైలు ప్రమాదం జరిగేది కాదని అంటున్నారు. 


Also Read: Odisha Train Accident Latest Updates: రైలు ప్రమాదంలో మరణించిన వారికి 35 పైసల బీమా వర్తిస్తుందా..? ఎంత డబ్బు వస్తుంది..?  


కవాచ్ వ్యవస్థ ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ప్రతి స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. రైలు, ట్రాక్, రైల్వే సిగ్నల్ సిస్టమ్‌తో అనుసంధానం చేశారు. ఈ మొత్తం వ్యవస్థ అల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఒకదానికొకటి భాగాలతో కమ్యూనికేట్ చేస్తుంది. లోకో పైలట్ రైల్వే సిగ్నల్‌ను జంప్ చేస్తే.. ఈ కవచ్‌ వ్యవస్థ లోకో పైలట్‌ హెచ్చరించడంతోపాటు ఆటోమేటిక్‌గా ట్రైన్‌కు బ్రేక్‌లు వేస్తుంది. అదేవిధంగా సేమ్ ట్రాక్‌పై మరో రైలు కూడా వస్తున్నట్లు కవాచ్ సిస్టమ్‌కు తెలిస్తే.. అది అవతలి రైలుకు హెచ్చరికను పంపుతుంది. రెండు రైళ్ల మధ్య కొంతదూరంలోనే రైళ్లను ఆపేస్తుంది. దక్షిణ మధ్య రైల్వేలోని 1445 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటివరకు 77 రైళ్లకు కవాచ్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.  


Also Read: Odisha Tragedy: కొడుకు బతికున్నాడా లేడా, శవాల కుప్పలో వెతుకుతున్న ఓ తండ్రి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి