India Omicron Status: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఇలా
India Omicron Status: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇటు ఇండియాలో కూడా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక బులెటిన్ విడుదల చేసింది.
India Omicron Status: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇటు ఇండియాలో కూడా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక బులెటిన్ విడుదల చేసింది.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల్లో విస్తరించింది. అమెరికా, యూకే వంటి దేశాల్లో ఒమిక్రాన్ ప్రమాదకరంగా మారింది. ఇండియాలో తొలిసారిగా బెంగళూరులో 2 కేసులు వెలుగు చూసిన తరువాత..క్రమక్రమంగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలోని 15 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. కొత్తగా 13 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కొత్త కేసుల సంఖ్య 213కు చేరుకోగా...ఇందులో 90 శాతమంది కోలుకున్నారు.
మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 6 వేల 317 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 318 మంది గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా మరణించారు. దేశవ్యాప్తంగా కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 78 వేల 190 కాగా, ఒక్క రోజులో 6 వేల 906 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 0.51 శాతంగా, రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) విషయంలో అత్యధికంగా ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24 కేసులున్నాయి.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య
ఢిల్లీ 57
మహారాష్ట్ర 54
తెలంగాణ 24
కర్ణాటక 19
రాజస్థాన్ 18
కేరళ 15
గుజరాత్ 14
జమ్ముకశ్మీర్ 3
ఒడిశా 2
ఉత్తరప్రదేశ్ 2
ఆంధ్రప్రదేశ్ 1
లడాఖ్ 1
చండీగఢ్ 1
తమిళనాడు 1
పశ్చిమ బెంగాల్ 1
Also read: Pakistan Digital Conspiracy: పాకిస్తాన్ కుట్ర భగ్నం, 20 యూట్యూబ్ ఛానెల్స్ బ్లాక్ చేసిన ఇండియా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి