Pakistan Digital Conspiracy: పాకిస్తాన్ భారీ కుట్రను ఇండియా భగ్నం చేసింది. ఏకంగా 20 యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్లాక్ చేసింది. డిజిటల్ మీడియా ద్వారా దేశంలో విషాన్ని నింపే ప్రక్రియకు అడ్డుకట్ట వేసింది.
ఇండియాపై ఎప్పుడూ విషం చిమ్ముతుండే పాకిస్తాన్ తలపెట్టిన మరో కుట్రను ఇండియా భగ్నం చేసింది. ఉగ్రవాదుల్ని దేశంలో పంపుతూ విద్వేషాలు రెచ్చగొట్టడం, హింసకు పాల్పడటం చేస్తూ వచ్చిన పాకిస్తాన్ కొత్తగా డిజిటల్ కుట్రకు(Pakistan Digital Conspiracy)తెరలేపింది. ఏకంగా 20 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా దేశంలో విషాన్ని నింపే ప్రయత్నం చేసింది. ఈ మాధ్యమాల ద్వారా నకిలీ వార్తల్ని దేశంలో వ్యాప్తి చేస్తోంది. భారతీయ ఇంటెలిజెన్స్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలు సమన్వయంగా ఈ కుట్రను వెలికి తీశాయి. పాకిస్తాన్ (Pakistan)మద్దతుతో నిర్వహిస్తున్న 20 యూట్యూబ్ ఛానెల్స్, 2 వెబ్‌సైట్స్‌ను బ్లాక్ చేయాలని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఆదేశించింది.
ఈ 20 యూట్యూబ్ ఛానెల్స్(Youtube Channels), రెండు వెబ్‌సైట్లు అదే పనిగా తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయని భారత్ గుర్తించింది. సున్నితమైన విషయాల గురించి ఈ ఛానెల్స్ నకిలీ వార్తల్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఈ ఛానెల్స్‌ను బ్లాక్ చేసేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను డైరెక్ట్ చేయాల్సిందిగా టెలీకం శాఖను అభ్యర్ధించింది. కశ్మీర్, ఇండియన్ ఆర్మీ, దేశంలోని మైనార్టీ కమ్యూనిటీలు, రామమందిరం, జనరల్ బిపిన్ రావత్ అంశాలపై తప్పుడు విభజన కంటెంట్‌ను ఈ మాధ్యమాలు ప్రసారం చేస్తూ వస్తున్నాయి.
ఇందులో భాగంగా పాకిస్తాన్(Pakistan)నుంచి పని చేస్తున్న నయా పాకిస్తాన్ గ్రూప్, యూట్యూబ్ ఛానెల్స్ నెట్‌వర్క్, ఇతర యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు వార్తల్ని ప్రసారం చేసే నెట్‌వర్క్ కలిగి ఉన్నాయని ఇండియా గుర్తించింది. భారతదేశానికి సంబంధించిన సున్నితమైన విషయాలపై నకిలీ వార్తల్ని ప్రసారం చేస్తూ విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఛానెళ్లకు 35 లక్షల కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్లున్నారు. ఈ ఛానెల్స్ వీడియోలను 55 కోట్లపైగా వీక్షించారు. కీలకమైన విషయమేమంటే..నయా పాకిస్తాన్ గ్రూప్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్‌ను పాకిస్తాన్‌కు చెందిన న్యూస్ ఛానెల్స్ యాంకర్లు స్వయంగా నిర్వహిస్తున్నారు. రైతుల ఉద్యమం, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన, ఇండియాకు వ్యతిరేకంగా మెనార్టీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ కంటెంట్ పోస్ట్ చేశాయి. అంతేకాకుండా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసేందుకు ఈ యూట్యూబ్ ఛానెల్స్ దోహదపడ్డాయని అంచనా వేస్తున్నారు.
దేశంలోని సమాచార వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 రూల్ నెంబర్ 16 ప్రకారం ప్రసార మంత్విత్వశాఖకు ఉన్న అత్యవసర అధికారాల్ని ఉపయోగించుకుంది.
Also read: Corona Cases in India: దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు.. 6,317 కేసులు, 318 మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి