'కరోనా వైరస్' క్రమక్రమంగా విస్తరిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఢిల్లీ అంతటా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి ఢిల్లీ CRPFలో కూడా ప్రవేశించింది.  దీంతో ఢిల్లీ CRPFప్రధాన కార్యాలయంలో  కలకలం రేగింది.  CRPF ప్రధాన కార్యాలయంలో  పని చేస్తున్న ఓ ఉన్నతాధికారికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా సంచలనం రేగింది. ఫలితంగా ఢిల్లీ CRPF ప్రధాన కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. 


భారత్‌లో 24 గంటల్లో 83 మంది బలి


భవన సముదాయాన్ని మొత్తం శానిటైజేషన్ చేయనున్నారు. ప్రస్తుతం కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు. అంతే కాకుండా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆఫీసుకు రావొద్దని చెప్పారు. కరోనా వైరస్ ఉద్ధృతంగా  ఉన్న నేపథ్యంలో పోలీసులు నిరంతరం రోడ్లపై పహారా కాస్తున్నారు. లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడక్కడా పోలీసులకు కూడా  కరోనా మహమ్మారి సోకుతోంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..