భారత్‌లో 24 గంటల్లో 83 మంది బలి

'కరోనా వైరస్' కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. భారత దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజు  రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

Last Updated : May 3, 2020, 11:17 AM IST
భారత్‌లో 24 గంటల్లో 83 మంది బలి

'కరోనా వైరస్' కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. భారత దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజు  రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

భారత దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య  40 వేల సమీపానికి చేరుకుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 39 వేల 980 కేసులు నమోదయ్యాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. మొత్తం కేసుల్లో 28 వేల 46 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 10 వేల 633 మందికి నయం చేసి ఇళ్లకు పంపించినట్లు వెల్లడించింది. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1301 మంది బలయ్యారు. 

మరోవైపు రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే 2 వేల 644 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 83 మంది కరోనా మహమ్మారి దెబ్బకు ప్రాణాలు విడిచారు. ఒక్క రోజులో గరిష్ట మృతుల సంఖ్య ఇదే కావడం విశేషం. 
 
మరోవైపు భారత దేశం మొత్తం మీద కరోనా వైరస్  కు బాగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య  12 వేలు దాటింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 1301 మంది చనిపోగా.. కేవలం మహారాష్ట్ర నుంచే  500 మంది బలయ్యారు. ఆర్ధిక రాజధాని ముంబై అత్యధికంగా ప్రభావితమైంది. ముఖ్యంగా  ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ధారవిలో అత్యధికంగా జనం కరోనా మహమ్మారి బారిన పడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News