Gujarat coast gaurd seized drugs from Pakistani fishing boat: గుజరాత్ (Gujrat) కోస్తా తీరం వెంబడి పాకిస్తాన్‌కు (Pakistan) చెందిన ఓ ఫిషింగ్ బోట్ పట్టుబడింది. ఆ బోట్‌లో రూ.400 కోట్లు విలువ చేసే 77 కేజీల హెరాయిన్‌ను కోస్ట్ గార్డ్ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్‌లోని కరాచీ పోర్టు నుంచి బయలుదేరిన ఆ బోట్ అక్రమంగా భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. గుజరాత్‌లోని కచ్ జిల్లా కోస్తా తీరం వెంబడి ఈ డ్రగ్స్‌ను అన్‌లోడ్  చేసేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. బోట్‌లో ఉన్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆదివారం అర్ధరాత్రి సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరాచీ (Karachi) నుంచి బయలుదేరిన ఆ బోట్ ఇరు దేశాల మధ్యనున్న ఇంటర్నేషనల్ మెరీటైమ్ బోర్డర్‌ను దాటి భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించినట్లు అందడంతో వెంటనే ఏటీస్, కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగారు. కచ్ జిల్లాలోని జకావ్ తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఆ బోట్‌ను పట్టుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం... పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు డ్రగ్ స్మగ్లర్స్ ఆ బోట్‌ను భారత్‌కు పంపించారు. ఆ ఇద్దరి పేర్లు హజీ హసన్, హజీ హసమ్‌గా గుర్తించారు. పంజాబ్‌లోని కొంతమంది వ్యక్తులకు ఈ డ్రగ్స్ (Illegal drugs trading) చేరాల్సి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.


 గుజరాత్ కోస్తా తీరం వెంబడి భారత్‌లోకి అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు యత్నిస్తూ గతంలోనూ కొంతమంది పాకిస్తానీలు, ఆఫ్గనిస్తానీలు, ఇరాన్ దేశస్తులు పట్టుబడ్డారు. ఏటీఎస్ తెలిపిన వివరాల ప్రకారం... 2018 నుంచి 2021, డిసెంబర్ వరకు నిర్వహించిన పలు ఆపరేషన్లలో రూ.4600 కోట్ల విలువ చేసే 920 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని (Gujarat) ముంద్రా పోర్టులో రూ.21 వేల  కోట్లు విలువ చేసే సుమారు 3వేల కేజీల డ్రగ్స్‌ను (Drugs) డైరెక్టోరేట్ ఆఫ్ ఇంటలిజెన్స్ విభాగం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.


Also Read:  Black Idli: ఇడ్లీలలో 'బ్లాక్ ఇడ్లీ' రుచి వేరయా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook