ముంబై నుంచి కోల్‌కతా బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్ చార్జింగ్ చేసేందుకు కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. ప్రయాణికుడు కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంపై ఆగ్రహించిన ఇండిగో సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిన్న ముంబైలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తాజాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఇండిగో సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.