Patanjali Coronil | ప్రపంచ దేశాలతో పాటు భారత్ సైతం ఎదుర్కొంటున్న సమస్య కరోనా వైరస్(CoronaVirus). అయితే ఈ మహమ్మారిని అరికట్టేందుకు తాము మందు తయారు చేశామని యోగా గురువు రాందేవ్ బాబా(Ramdev Baba) ప్రకటించారు. హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరోనాకు మెడిసిన్‌ కరోనిల్(Coronil)ను మార్కెట్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు. లాక్‌డౌన్‌లో బరువు పెరిగారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనిల్ వాడిన వారిలో 69శాతం మంది కేవలం మూడు రోజుల్లోనే కరోనా నెగటివ్ వచ్చిందని, మిగతావారికి వారం రోజుల్లో నెగటివ్‌గా తేలిందన్నారు. మొత్తానికి 100శాతం రికవరీ అయ్యారని, క్లినికల్ ట్రయల్స్‌లో ప్రూవ్ అయిన మెడిసిన్ జూన్ 29 నుంచి ఆర్డర్ మి (OrderMe) యాప్‌లో అందుబాటులో ఉంటుందన్నారు. పతంజలి స్టోర్స్‌లోనూ త్వరలో కరోనిల్(Coronil) విక్రయాలు ప్రారంభిస్తామని రాందేవ్ బాబా తెలిపారు. Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ 


పతంజలి కరోనా మెడిసిన్ కరోనిల్‌(Patanjali Corona Medicine)లో రెండు ట్యాబ్లెట్లు, ఓ టానిక్ (లిక్విడ్) ఉంటుంది. దీన్నే కరోనిల్ కిట్(Coronil Kit) అంటారు. ఓవరాల్ కరోనిల్ కిట్‌లో కరోనిల్, శ్వాసరి (Shwasari), అను టెల్(Anu Tel) అని మూడు రకాల మెడిసిన్ ఉంటుంది. కరోనిల్ కిట్(Coronil Kit Price) ధర రూ.545గా నిర్ణయించారు.  కోవిడ్19 పేషెంట్లు 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు సగం మెడిసిన్ వాడాలని, 15 నుంచి 18 ఏళ్ల వారికైతే పూర్తి స్థాయిలో కరోనిల్ కిట్ వాడవచ్చునని తెలిపారు. కరోనిల్‌తో పాటు తీసుకునే ‘శ్వాసరి’(Shwasari) శ్వాస వ్యవస్థను మెరుగు పరుస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం లాంటి సమస్యలను పరిస్కరిస్తుంది. ‘అను టెల్’(Anu Tel) రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తుందని పతంజలి సంస్థ చెబుతోంది. అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి


అప్పటివరకు ఆగాలన్న ఆయుష్ మంత్రిత్వశాఖ
పంజతలి వారు తీసుకొస్తున్న కరోనా మెడిసిన్ కరోనిల్‌పై ఇప్పుడే ఎలాంటి ప్రకటనలు ఇవ్వరాదని, విక్రయాలు ప్రారంభించవద్దని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. కరోనిల్ తయరీ విధానంతో పాటు శాస్త్రీయంగా ఎక్కడ, ఎలా ప్రయోగించారో పూర్తి వివరాలు తమకు తెలపాలని పతంజలి సంస్థకు సూచించింది. ఇదివరకే ఆ శాఖకు అన్ని వివరాలు పంపించామని, ఇది కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని పతంజలి సంస్థ ఛైర్మన్ బాలకృష్ణ ఓ పోస్ట్ ద్వారా స్పందించారు.



జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..