Weight Loss Tips: లాక్‌డౌన్‌లో బరువు పెరిగారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి

Weight Loss Tips | లాక్‌డౌన్‌లో ఇంటి వద్ద గంటల తరబడి బరువు పెరిగి సమస్యల బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా బరువు పెరగకుండా చూసుకోవడంతో పాటు తేలికగా బరువు తగ్గవచ్చు. ఆ ఆరోగ్య చిట్కాలు మీకోసం...

Shankar Dukanam Shankar Dukanam | Updated: Jun 15, 2020, 06:46 PM IST
Weight Loss Tips: లాక్‌డౌన్‌లో బరువు పెరిగారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి

Weight Loss Tips At Home : కరోనా వ్యాప్తి నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ఇచ్చాయి. అయితే ఇంటి వద్ద నుంచి వర్క్ చేయడం తేలికేమీ కాదు. టార్గెట్ సకాలంలో పూర్తి చేయడం ఎంతో ముఖ్యమని, కొత్తగా ఏదైనా చేయాలని భావించే ఉద్యోగులు మంది ఉన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు గంటల తరబడి పని నిమిత్తం గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడంతో బరువు పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే బరువు తగ్గేందుకు కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే సరి..  అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి

బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి... (Weight Loss Tips In Telugu)

  • ఉదయం పూట తీసుకునే అల్పాహారం మీ ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. అల్పాహారం అసలు మానవద్దని, కావాలంటే బ్రేక్‌ఫాస్ట్ సాధ్యమైనంత ఎక్కువగా తింటే అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారని (Weight Loss) వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట కాస్త తక్కువగా తినడం ఉత్తమం.
  • మధ్యాహ్నం భోజనంతో పాటు ఉడకబెట్టిన బంగాళ దుంపలు తీసుకోవాలి. దీంతో అధికంగా తీసుకునే ఆహారాన్ని మనకు తెలియకుండానే నియంత్రించుకుంటాం. Also Read: ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..
  • వర్క్ ఫ్రమ్ చేసినా ఇంటి పనుల్లో కొద్దిసేపైనా చురుగ్గా పాల్గొనాలి. దీనివల్ల గంటల తరబడి కూర్చోవడం తగ్గుతుంది. శరీరానికి కాస్త శ్రమ ఇవ్వడంతో కేలరీలకు కేలరీలు కరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
  • రోజుకు రెండు టీ స్పూన్ల మోతాదులో వెనిగర్ తీసుకుంటే 30 రోజుల్లో దాదాపు రెండున్నర కిలోల బరువు తగ్గుతాం. అయితే ఏదైనా ద్రవ పదార్ధాలు, సలాడ్స్ లాంటి వాటిపై వేసి తీసుకోవడం మంచిది.
  • మంచినీళ్లు అధికంగా తాగాలి. తినడానికి కనీసం అరగంట ముందు మంచినీరు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. తద్వారా బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
  • కాఫీ, టీ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. కాఫీ తాగితే జీర్ణక్రియ 3 నుంచి 11శాతం పెరుగుతుంది. అదే సమయంలో కొవ్వును 10 నుంచి 15శాతం వరకు తగ్గిస్తుంది. సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు
  • వ్యాయామం, ఎరోబిక్స్ ఎక్సర్‌సైజ్ చేసి బరువు(How To Weight Loss At Home) తగ్గవచ్చు. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల శారీరకంగానే కాదు మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం.
  • కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారానికి స్వస్తి పలకండి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరానికి మంచింది. జీర్ణవ్యవస్థ సాఫీగా ఉంటే బరువు పెరిగే సమస్య దరిచేరదు.
  • కొన్ని అధ్యయనాల ప్రకారం.. రాత్రి ఆలస్యంగా నిద్రించే చిన్నారులలో బరువు పెరిగే అవకాశం 89 శాతం మందిలో ఉంటుందని, అదే విధంగా పెద్దవారిలో 55 శాతం మందిలో ఊబకాయం(Obesity) బారిన పడే అవకాశం ఉంది.
  • ఫైబర్, ప్రోటీన్లు అధికంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటే స్థూలకాయం సమస్యకు ఫైబర్, ప్రోటీన్లు (Health Tips) చెక్ పెడతాయి.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్