ముంబైలో నైట్ లైఫ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముంబైలో మాల్స్, హోటళ్ళు, థియేటర్లు 24 గంటలు తెరిచి ఉంచేందుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే బుధవారం ప్రకటించారు. ముంబై అంతర్జాతీయ నగరం కాబట్టి నైట్ లైఫ్‌కు అనుమతి అవసరం ఉందని ఆదిత్య ఠాక్రే  అన్నారు. లండన్‌లో  నైట్ లైఫ్ కారణంగా  ఆర్ధిక వ్యవస్థ భారీగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ నైట్ లైఫ్‌కు అనుమతి ఇవ్వడం వల్ల ముంబై ఆదాయంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆదిత్య ఠాక్రే చెప్పుకొచ్చారు.  ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా పోలీసులపై ఎలాంటి ఒత్తిడి పెంచడం లేదని అన్నారు. 


Read Also: తనాజీ సినిమాకు వినోద పన్ను రద్దు
పబ్‌లు, బార్లకు మాత్రం నో. . 
 పబ్‌లు, బార్‌లను మాత్రం  24 గంటలు తెరిచి ఉంచడానికి అనుమతించబోమని మంత్రి ఆదిత్య ఠాక్రే తెలిపారు.  అర్థరాత్రి  1.30 గంటల వరకు మాత్రమే పబ్,  బార్ తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. ఎక్సైజ్ చట్టాన్ని సవరించేందుకు ప్రయత్నించడం లేదని చెప్పారు. మహారాష్ట్ర సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం జనవరి 27 నుంచి అమలులోకి రానుంది.  మొదటి దశలో..  నాలుగు ప్రదేశాల్లో దీన్ని అమలు చేస్తారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..