Maharashtra Government Gives'Tanhaji' tax-free in the state : తనాజీ సినిమాకు వినోద పన్ను రద్దు

బాలీవుడ్ హీరో  అజయ్ దేవగణ్ తాజా చిత్రం తనాజీ. అన్ సంగ్ వారియర్ అనేది ఉపశీర్షిక. హిందీలో తెరకెక్కిన ఈ చిత్రానికి మహారాష్ట్ర సర్కారు భారీ ఊరటనిచ్చింది. 

Last Updated : Jan 22, 2020, 02:11 PM IST
Maharashtra Government Gives'Tanhaji' tax-free in the state : తనాజీ సినిమాకు వినోద పన్ను రద్దు

బాలీవుడ్ హీరో  అజయ్ దేవగణ్ తాజా చిత్రం తనాజీ. అన్ సంగ్ వారియర్ అనేది ఉపశీర్షిక. హిందీలో తెరకెక్కిన ఈ చిత్రానికి మహారాష్ట్ర సర్కారు భారీ ఊరటనిచ్చింది. ఈ సినిమాకు మహారాష్ట్రలో వినోద పన్ను నుంచి మినహాయింపునిస్తూ ఉద్దవ్ ఠాక్రే సర్కారు నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర చరిత్రకు సంబంధించిన చిత్రం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ సినిమాకు వినోద పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ  చిత్ర నిర్మాత హీరో అజయ్ దేవగణ్ .. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. ఐతే నిర్ణయం కాస్త ఆలస్యంగా వెలువడింది. 
 See Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోలు

తనాజీ..  ది అన్ సంగ్ వారియర్ సినిమాను శివాజీ సైన్యాధ్యక్షుడు తనాజీ మాలుసరే జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించారు. సైఫ్ అలీఖాన్, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు. చిత్రం అంతా 1670వ సంవత్సరం నేపథ్యంలో నడుస్తుంది. అప్పట్లో తనాజీ మాలుసరే.. మొఘల్ సామ్రాజ్యంపై సైన్యంతో దండెత్తిన క్రమంలో జరిగిన పరిణామాలను సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా 2020 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా .. ఇప్పటికే కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. దాదాపు 300 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News