Petrol Diesel Price: ఎట్టకేలకు ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel Rates Down From Today: ఎట్టకేలకు వాహనదారులకు ఊరట లభించింది. గత కొద్ది నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Petrol Diesel Rates Down From Today: వాహనదారులకు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఇంధన ధరలు తగ్గుముఖం పడుతుండడంతో పెట్రోల్, డీజిల్ ధరలను కాస్త తగ్గించింది. రెండింటిపై రూ.40 పైసలు తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గిన ధరలు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ రూ.97.8, ఏపీలో లీటర్ పెట్రోల్ రూ.111.67, డీజిల్ ధర రూ.99.40గా ఉంది.
దాదాపు ఆరు నెలల తరువాత ధరలు తగ్గడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు 2 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉనట్లు తెలుస్తోంది. ఈ తగ్గింపు క్రమంగా జరగనుందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు కొంతకాలంగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత కొంతకాలంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 95 డాలర్ల కంటే తక్కువగానే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 7న చివరిసారిగా ధర తగ్గింది. మళ్లీ దాదాపు ఏడు నెలల తరువాత పెట్రోల్, డీజిల్ తగ్గడంతో వాహనదారులకు కాస్తా ఊరట కలిగింది. ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండడంతో సంతోష పడుతున్నారు.
దీపావళి పండుగల సీజన్‌తో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో అక్టోబర్ 15వ తేదీ వరకు దేశంలో ఇంధన విక్రయాలు పెరిగాయి. పెట్రోలు, డీజిల్ అమ్మకాలు గతేడాది కంటే 22-26 శాతం పెరిగాయి. అక్టోబర్ 2020 మొదటి అర్ధభాగంతో పోలిస్తే ఇప్పుడు 31 శాతం ఎక్కువ పెరిగాయి. అక్టోబర్ 1 నుంచి 15 మధ్య కాలంలో పెట్రోల్ అమ్మకాలు 22.7 శాతం పెరిగి 1.28 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. అదే సమయంలో గతేడాది 1.05 మిలియన్ టన్నులు పెట్రోల్ అమ్మకాలు జరిగాయి.
Also Read: LPG Gas Cylinder Rates: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. కొత్త రేట్లు ఇలా..
Also Read: Harbhajan Singh: ఆ ఇద్దరిని వెంటనే టీమ్ నుంచి తీసేయండి.. రోహిత్ శర్మకు భజ్జీ సలహా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook