Central Government Scheme: నిజం గడప దాటేలోపు అబద్దం ఊరంతా తిరిగి వస్తుందని అంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత వాస్తవాల కంటే.. ఫేక్ వార్తలే ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాయి. దున్నపోతు ఈనిందంటే.. దూడను కట్టెయ్యమనట్లు.. కాస్త సమాచారం తెలియగానే నిజమో కాదో తెలుసుకోకుండా చాలా మంది షేర్ చేస్తున్నారు. వారు పప్పులో కాలేయడమే కాకుండా.. ఇతరులకు ఆ తప్పుడు సమాచారాన్ని చెరవేసి తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల విషయంలో ఫేక్ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రజల కోసం కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తోందని ప్రచారం నెట్టింట జోరుగా జరుగుతోంది. మరి ఈ ప్రచారం నిజమెంతా..? నిజంగా కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకం ప్రవేశపెట్టిందా..? ఈ విషయంపై పీఐబీ క్లారిటీ ఇచ్చింది. వైరల్ అవుతున్న ఈ సందేశం నకిలీదని స్పష్టం చేసింది.


కేంద్ర ప్రభుత్వం అటువంటి పథకాన్ని అమలు చేయడం లేదని పీఐబీ వెల్లడించింది. దయచేసి అలాంటి సందేశాలను ఫార్వార్డ్ చేయవద్దని కోరింది. తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నవారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఫేక్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాంటి మెసేజ్‌లను ఎవరితోనూ షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పథకం గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే.. అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే సంప్రదించాలని పేర్కొంది. 


 




ఇలాంటి నకిలీ వార్తలకు దూరంగా ఉండాలని .. ఈ వార్తలను ఎవరితోనూ పంచుకోవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాంటి వార్తలను ఫార్వార్డ్ చేయకండని హెచ్చరించింది. మీరు ఏదైనా వైరల్ సందేశం నిజం తెలుసుకోవాలనుకుంటే.. మీరు  socialmedia@pib.gov.in కు మెయిల్ చేయవచ్చు.


Also Read: Chennai Super Kings: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్ ఇదే.. ఆ ప్లేయర్ ఎంట్రీతో మరింత పవర్‌ఫుల్   


Also Read: PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ లబ్ధిదారులకు ముఖ్యగమనిక.. మీ ఖాతాలో నగదు ఎప్పుడు జమకానుందంటే..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి