Paddy Procurement: ముదురుతున్న వరి వివాదం.. లేటెస్ట్ అప్డేట్
తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వరిపోరుకు సిద్దమైన సంగతి తెలిసిందే. పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పక కొనాలి అని సీఎం కేసీఆర్ అంటుంటే.. దీనిపై కేంద్ర ప్రభుత్వం మాటలు దాటేస్తుంది.
Paddy Procurement: తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వరిపోరుకు సిద్దమైన సంగతి తెలిసిందే. పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పక కొనాలి అని సీఎం కేసీఆర్ అంటుంటే.. దీనిపై కేంద్ర ప్రభుత్వం మాటలు దాటేస్తుంది.
నిన్న తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశం తరువాత తెలంగాణ మంత్రుల బృందం.. ఢిల్లీకి వెళ్లింది. అక్కడ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నారు క్రమంలో ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి పీయుష్ గోయల్ కీలక ప్రకటన చేశారు.
తెలంగాణలో ధాన్యం మొత్తాన్ని కొనలేమన్నారు. అదనంగా ఉన్న ఉత్పత్తుల డిమాండ్, సరఫరా ఆధారంగానే కొనుగోలు ఉంటాయని స్పష్టం చేశారు. పీయుష్ గోయల్‌ను టీఆర్ఎస్ ఎంపీలు కలిసిన కాసేపటికే ఈ ప్రకటన వచ్చింది.
ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఉన్న సమయంలో కేంద్రమంత్రి పీయుల్ గోయల్ ప్రకటన చేయడంతో వరి వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలుపై ఉగాది తర్వాత ఢిల్లీలో రైతు ధర్నా చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనలు సైతం నిర్వహించింది.
కేంద్రం తీరుపై తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పంజాబ్ తరహాలోనే తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై ఎంతవరకైనా పోరాడుతామంటున్నారు.
Also Read: Boycott RRR in Karnataka: 'ఆర్ఆర్ఆర్'కి కన్నడిగుల షాక్... సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపు...
Also Read: COVID Restrictions: మార్చి 31 తర్వాత కొవిడ్ ఆంక్షలన్నీ ఎత్తివేత- కానీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook