Piyush Goyal given additional charge: న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, లోక్ జన శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ ( Ram Vilas Paswan ) నిన్న అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 74ఏళ్ల పాశ్వాన్‌కు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అక్టోబరు 4న గుండెకు ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి ఆయన చికిత్స పొందుతూ.. ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. అయితే.. పాశ్వాన్ హఠాన్మరణంతో ఎన్డీఏ ప్రభుత్వం శుక్రవారం కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేసింది. Also read : Ram Vilas Paswan's death: కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాశ్వాన్ మంత్రిగా ఉన్న.. వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా సరఫరా శాఖ (Consumer Affairs, Food and Public Distribution Ministry) బాధ్యతలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ (Union Railway Minister Piyush Goyal) కు అదనంగా అప్పగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం మేరకు కేంద్ర రైల్వే, ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ
చేశారు.  Also read: 
Lalu Prasad Yadav: బీహార్ మాజీ సీఎం లాలూకు బెయిల్.. కానీ


లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీని స్థాపించిన రామ్‌విలాస్ పాశ్వాన్‌.. దాదాపు ఐదు దశాబ్ధాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారు. దేశంలో అత్యున్నత స్థానానికి ఎదిగిన దళిత నాయకులలో ఒకరిగా పేరొందారు. ఎనిమిది సార్లు లోక్‌స‌భ‌కు, ఒక్కసారి రాజ్య‌స‌భ సభ్యుడిగా.. జ‌న‌తాద‌ళ్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌భుత్వాల్లో ఆయ‌న కేంద్ర మంత్రిగా పాశ్వాన్ బాధ్య‌త‌లు నిర్వర్తించారు.  Also read: NTR: అలాంటివారితో ఆన్‌లైన్ పరిచయాలొద్దు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe