Ram Vilas Paswan passes away: న్యూ ఢిల్లీ: కేంద్ర మంత్రి, లోక్ జన శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ ( Ram Vilas Paswan ) ఇక లేరు. ప్రస్తుతం ఆయన వయస్సు 74 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ విలాస్ పాశ్వాన్ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. రామ్ విలాస్ పాశ్వాన్ మృతి చెందినట్టుగా ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ ( Chirag Paswan ) ట్విటర్ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 4నే ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన గుండెకు శస్త్రచికిత్స ( Heart surgery ) జరిగింది. రామ్ విలాస్ పాశ్వాన్ ఇక కోలుకుంటున్నారు అని భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం ఆయన అభిమానులకు, సన్నిహితులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. Also read : Baba ka Dhaba viral video: గిరాకీ లేదని కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధ దంపతులు.. వీడియో
ఐదు దశాబ్ధాలుగా రాజకీయ జీవితంలో ఉన్న రాంవిలాస్ పాశ్వాన్ ( Ram Vilas Paswan' political life ) దేశంలోనే ఉన్నత స్థానానికి ఎదిగిన దళిత నాయకులలో ఒకరిగా పేరొందారు. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల రాజకీయాల్లో ( Bihar politics ) తన ముద్ర వేసిన రామ్ విలాస్ పాశ్వాన్.. జాతీయ రాజకీయాల్లోనూ తన ఉనికిని చాటుకుంటూ వచ్చారు. రామ్ విలాస్ మృతిపై ( Ram vilas Paswan's death ) పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. Also read : PM Narendra Modi: నియమాలు పాటిద్దాం.. కరోనాను జయిద్దాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe